08-07-2009 :: 8 AM
మార్కెట్ నాడి
అంతర్జాతీయ ఏజెన్సీ " మక్వుఅరీ " , ఈ సంవత్సరానికి గాను సెన్సెక్స్ నకు 18000 పాయింట్ల టార్గెట్ ను సూచించింది. నిన్న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం , ప్రనాబ్ ముఖేర్జీ విడుదల చేసిన బడ్జెట్ కి మక్వుఅరీ కితాబు నిచ్చింది . ఇది అభివృద్ధి సాధించే బడ్జెట్ గా పేర్కొనటం విశేషం. ఇది ఇలా ఉండగా , మందగించిన ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దిశగా బడ్జెట్ లో పెరిగిన ద్రవ్యలోటు సహకరిస్తుందని ,ప్రభుత్వం అన్ని గణాంకాలనూ, పరిస్థితులనూ పరిశీలించిన మీదటే ద్రవ్యలోటును పెంచే దిశగా అడుగులు వేసిందని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన భరోసా ఈ సందర్భం లో గమనార్హం. ఈ అంశాలను పరిశీలిస్తే నేడు మన మార్కెట్లు మరికొంత ఉత్సాహం తో ముందుకు పయనించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఐతే గత వారం రోజులు గా ఆసియా మార్కెట్లు నష్టాల లో పయనిస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పై పడే అవకాశం ఉంది.
మా అంచనా ప్రకారం, బడ్జెట్ నకు సంబంధించిన రిపోర్టులు అన్ని విడుదల అయిన తరువాత మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల తో అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆటు పొట్ల తో పయనించ వచ్చు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 14170
- అవరోధాలు : 14243-14534
- మద్దత్తులు : 14040-13886-13781
.......................................................................................................