- బడ్జెట్ పై ప్రముఖుల స్పందన " మార్కెట్ ఫోకస్ " పేజి లో చూడగలరు
- బడ్జెట్ ప్రభావం వలన ఏ ఏ స్టాకులు లాభం పొంద నున్నాయో , ఏ ఏ స్టాకులు నష్టపోనున్నాయో వాటి జాబితా తెలుసుకునేందుకు " ఈక్విటీ " పేజి ని చూడగలరు.
- మార్కెట్ నాడి
బడ్జెట్ పట్ల అసంతృప్తి చెందిన మన మార్కెట్లు నేడు కూడా నిన్నటి చేదు అనుభవాలను నెమరు వేసుకోనున్నాయి । నిన్న బడ్జెట్ లో లోటు GDP లో 6.78 % వుండటం తో మన మార్కెట్ల పట్ల విదేశీ సంస్థాగత మదుపరులు ల కు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటి కే మన దేశానికి అంతర్జాతియ రేటింగ్ సంస్థలు INVESTMENT RATING ని అంతంత మాత్రం గా సూచిస్తున్నాయి. మునుముందు ఇది కనిష్ట స్థాయికి చేరుకునే ప్రమాదం లేక పోలేదు. ఇప్పటివరకు ప్రపంచ మార్కెట్ల కు అతీతం గా వ్యవహరించిన మన మార్కెట్లు , ఇప్పుడు నష్టపోవటం లో ప్రపంచ మార్కెట్ల తో పోటి పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక మంత్రి పై వత్తిడి పెంచేందుకు గాను మార్కెట్లు మరికొంత క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి దృశ్య రానున్న కొన్ని రోజుల లో మార్కెట్ల లో భల్లూకాలు వీర విహారం చేయవచ్చు.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
గత ముగింపు: 14043
అవరోధాలు : 14243-14534
మద్దత్తులు : 13978-13886-13781-13590
.......................................................................................................