06-07-2009 :: 4.30 PM
మార్కెట్ రిపోర్ట్
నేడు పార్లమెంటు లో ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టి న బడ్జెట్ మార్కెట్ ని పూర్తి గా విస్మయ పరిచింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టవచ్చన్న అంచనాల తో మార్కెట్ నేటి ఉదయం లాభాల తో ప్రారంభమయ్యింది. నేడు సెన్సెక్స్ గరిష్టం గా 15097 పాయింట్ల కు చేరుకుంది. ఐతే ఆర్ధిక మంత్రి తమ బడ్జెట్ లోటు ని GDP లో 6.78 % గా సూచించటం తో మార్కెట్లు బావురుమన్నాయి. పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సురన్సు కంపనీలు ప్రభుత్వ పరిధి లో పనిచేస్తాయని చెబుతూ ఆర్ధిక సంస్కరణలకు తిలోదకాలు వదలటం తో మార్కెట్లు COMRADE ల వర్ణం కి మారి పోయాయి. మంత్రి , ఆర్థిక సంస్కరణ ల కి కట్టు బడి ఉంటామని నోటి మాట మాత్రం పలికారు.
ఈ నిరుత్సాహ వాతావరణం లో సెన్సెక్స్ ఒకానొక దశ లో క్షీణించి 14 వేల పాయింట్ల కంటే తక్కువ గా పడిపోయి కనిష్టం గా 13959 పాయింట్లకు చేరుకుంది. చివరకు 869 పాయింట్ల నష్టాల తో 14043 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 259 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 4166 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫ్రా , వ్యవసాయ రంగాలకి ,మా ముందస్తు అంచనాలకి అనుగుణం గా , మంత్రి పెద్ద పీట వేసారు. అదే విధం గా ఎరువుల సబ్సిడీ విషయం లో కూడా మంత్రి మా అంచనాలను నిజం చేసారు. ఐతే ఇవి ఎ విధం గా అమలు పరుస్తారో తెలియపరచక పోవటం తో మార్కెట్ల లో ఎఫ్. యమ. సి. జి. మినహా అన్ని రంగాలు భారి గా కోల్పోయాయి. బ్యాంకింగ్ , రియాల్టీ , క్యాపిటల్ గూడ్స్ రంగాలు చావు దెబ్బ తిన్నాయి. ఈ రంగాలు 8 ~7 % మేరకు నష్టాలను చవిచూసాయి.
నేటి మార్కెట్ లో స్మాల్ క్యాప్ రంగం 4.5% , మిడ్ క్యాప్ 5.17 % కృంగి పోయాయి.
నేటి సెన్సెక్స్ స్టాకు ల లో ఐ. టి. సి. ౩.13 % , హిందూస్తాన్ యూని లీవర్ 0 .99 % లాభ పడ్డాయి. కాగా రిలయన్స్ ఇన్ఫ్రా 12.47 % , ఐ. సి. ఐ. సి. ఐ బ్యాంకు 10.09% నష్టాల లో కూరుకు పోయాయి.
బడ్జెట్ ముఖ్య అంశాల కై "మార్కెట్ ఫోకస్ "పేజిని చూడండి.
...............................................................................................