06-07-2009 :: 8 AM
మార్కెట్ నాడి
ఈ రోజు ఉదయం 11 గం. నకు లోక సభ లో ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్ తదుపరి దశ ని నిర్దేశించ నున్నది. బడ్జెట్ పై అంచనాలు , మార్కెట్ స్పందన ఏ విధం గా ఉండనున్నదో , ఏ స్టాక్ ప్రబావితం కానున్నదో, నేడు మీరు ఈ వెబ్సైటు ద్వారా ఎప్పటికప్పుడు తెలిసుకునే సౌకర్యం కలిగిస్తునందుకు మేము ఆనందిస్తున్నాము.
నేటి సెన్సెక్స్ నకు 14960 మరియు 15167 అతి కీలక అవరోధాలు. ఈ అవరోధాలు ఆశజనక బడ్జెట్ ఉంటే ,మార్కెట్లు సునాయాసం గా చెదించ నున్నది. బడ్జెట్ నిరుత్సాహ పరిస్తే మాత్రం సుమారు 14252 పాయింట్ల వరకు పడిపోయే అవకాశం ఉంది. బడ్జెట్ ముందస్తు అంచనాలు, ఎ రంగాలు లాభ పడనున్నాయి, సెన్సెక్స్ పయనం ఎటువైపు ?, మున్నగు అంశాలను " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో నిన్న ప్రచురించాము. చదువరులు ఈ విషయాన్ని గమనించ గలరు. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకు ల జోలికి వెళ్ళకుండా , బడ్జెట్ వలన లాభ పడే రంగా ల వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 14913
- అవరోధాలు : 14960-15088 -15167-15333
- మద్దత్తు స్థాయిలు : 14645-14534-14243