02-07-2009 :: 6:15 PM
  • మార్కెట్ రిపోర్ట్

  • నేడు తీవ్ర మైన ఒడిదుడుకులకు లోనయి మన మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభ పడి 14658 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 8 పాయింట్లు లాభ పడి 4348 పాయింట్లు నమోదు చేస్తూ ఫ్లాట్ గా ముగిసింది. నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభకు సమర్పించారు. ఇందులో భాగంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థలనుంచి పెట్టుబడులను ఉహసంహరించనున్నట్లు , రక్షణ, బీమా రంగాల్లో దాదాపు 49శాతం మేరకు విదేశీ, ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించనున్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్థికమంత్రి లోక్ సభలో తెలిపారు. ఇందులో భాగం గా ఈక్విటీ మీద ప్రస్తుతం ఉన్న STT, FRINGE BENIFIT TAX, COMMODITY TAX మున్నగునవి రద్దు చేయవచ్చన్న సర్వే సిఫారుసు ని తెలియచేసారు. లోటు రహిత బడ్జెట్ , ఆర్ధిక సంస్కరణలు మున్నగు అంశాల పై ఆర్ధిక సర్వే వెల్లడించింది. కాగా నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల అయ్యాయి. జూన్ 20తో ముగిసిన వారానికి ద్రవ్యోల్భణం కొంత మేర పెరిగింది. అయిన కూడా ఇంకా మైనస్ లోనే ఉంది. ఈ సారి ద్రవ్యోల్బణం -1.30గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి ద్రవ్యోల్బణం 11.8 గా నమోదయ్యింది. ఆయిల్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన లో కిరోసీన్, గ్యాస్ లో నెలకొని వున్న వసూళ్ళ లో వెలితి ని నిక్షేపాలను వెలికి తీసే కంపనీ లు భరించ బోవని స్పష్టం చేయటం తో ONGC, GAIL స్టాకు లు భారి గా లాభ పడ్డాయి. ఈ అంశాల మధ్య నేడు మార్కెట్లు సతమత మయ్యాయి అని చెప్పవచ్చు. నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ ఇం డే క్స్ 0.33 % లాభ పడగా , స్మాల్ క్యాప్ 0.74 % వృద్చిని నమోదు చేసింది. నేడు మెటల్స్ రంగం 3.26 %, పి. యస్. యు రంగం 1.95 % వృద్ధి చెందగా , క్యాపిటల్ గూడ్స్ 1.01 % , ఆటో 0.91 % క్షీణించాయి. సెన్సెక్స్ స్టాకు ల లో ONGC 7 %, TATA STEEL 6.4 % వృద్ధిని నమోదు చేయగా , BHEL , RELIANCE 3%, 2.3% నష్టపోయాయి.

  • ఆర్ధిక సర్వే ముఖ్యాంశాల కొరకు మార్కెట్ ఫోకస్ పేజిని చూడగలరు . ...............................................................................................