- 02-07-2009 :: 8 AM
- మార్కెట్ నాడి
బడ్జెట్ ఆసన్నమౌతున్న కొద్ది మార్కెట్లో ఉత్కంఠత పెరుగుతోంది. నిన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం వలన తీవ్ర ఒడిదుడుకు లకు లోనయిన మన మార్కెట్లు నేడు కొంత ఊపిరి పీల్చుకో నున్నాయి. గత రాత్రి అమెరికా లో విడుదలయిన s & p సూచీ ప్రకారం గృహ నిర్మాణం, ఉత్పత్తి రంగాల లో పెరుగుదల ఆశాజనకం గా ఉండటం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా దాదాపు లాభాల బాట లో పయనిస్తున్నాయి . ఈ అంశం మన మార్కెట్లను కూడా సానుకూలం గా ప్రభావితం చేయనున్నది. నేడు మన మార్కెట్లు శుభారంభం చేయనున్నాయి .
మన మార్కెట్లు రేపు ప్రవేశ పెట్టబోయే రైల్ బడ్జెట్ ని అంచనాలు వేస్తూ , నేడు ట్రేడ్ అవ్వనున్నాయి. రైల్ బడ్జెట్ జన రంజకం గా ఉంటుందని ఇప్పటికే రైల్ మంత్రి మమత బెనర్జీ తెలియచేసారు. నేడు రైల్వే కి సంబంధించిన స్టాకులు లో కొంత సంచలనం కనిపించ నున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 14645
- అవరోధాలు : 14757-14888-14930-15088
- మద్దత్తులు : 14645-14534-14243
...............................................................................................................