03-07-2009 :: 8:15 AM

మార్కెట్ నాడి

గత రెండు రోజులు గా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనోవుతున్నాయి. బడ్జెట్ పై పెద్ద ఆశలు లేనందున మార్కెట్ల లో ఇప్పటివరకు BULLS ప్రభావం కనిపించ లేదు. నేడు కూడా ఇదే ధోరణి కనిపించ వచ్చు. నేఁడు రైల్వే బడ్జెట్ కనుక మార్కెట్ దృష్టి సమస్తం రైల్ బడ్జెట్ పైనే ఉండనున్నది. రైల్ బడ్జెట్ జన రంజకం గా ఉండవచ్చని ఇప్పటికే రైల్వే శాఖా సూచన ప్రాయం గా తెలియచేసింది . కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ ఈ బడ్జెట్ ప్రతిపాదన ల వలన పెద్ద గా ఉత్సహా భరితం గా ఉండక పోవచ్చు. ఈ బడ్జెట్ ని అనుసరించి కొన్ని కంపనీలు కొంత లాభ పడే అవకాశం ఉంది. కాని ఈ లాభాలు కేవలం స్పెకులేషన్ గా నే పరిగణించాలి .

ఇక ప్రపంచ మార్కెట్ల ధోరణి ని సమీక్షిస్తే నేడు ఆసియా మార్కెట్లు భారి నష్టాలో కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నేడు ఇదే రీతి న సంచరించ వచ్చు. అమెరికా , ఐరోపా ల లో నిరుద్యోగ సమస్య రోజు రోజు కి పెరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నందువలన గత రాత్రి అమెరికా మార్కెట్లు సైతం తీవ్ర అమ్మకాల వత్తిడికి లోనయ్యింది. ఈ అంశాలు నేడు మన మార్కెట్ల లో bears కి పట్టు సాధించేందుకు ఉపయోగపడనున్నాయి. ప్రధాన బడ్జెట్ ప్రతిపాదనలు , సంస్కరణల అమలు పట్ల ప్రభుత్వం కనబరచ బోయే చిత్తశుద్ధి ఆశాజనకం గా ఉంటే మార్కెట్లు కొంత ఊరట పొందవచ్చు. కాబట్టి ఆర్ధిక శాఖ ప్రకటించ బోయే ప్రకటనలు మన మార్కెట్ల గతి ని కొంత మేరకు నిర్ధారించ నున్నాయి. ఏది ఏమైనప్పటికీ , నేడు మార్కెట్ల లో ఉత్సాహం కొరవడనున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14658
  • అవరోధాలు : 14757-14888-14930-15088
  • మద్దత్తులు : 14645-14534-14243

........................................................................................