• 01-07-2009 :: 6:15 PM

  • మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు పుంజుకుని 14,646 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 4,350 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.05 శాతం, నిఫ్టీ 1.36 శాతం చొప్పున వృద్ధి చెందాయి.ఈ రోజు 27 పాయింట్ల లాభంతో 14,506 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలతో కూడిన సంకేతాల ప్రభావాన ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ క్షీణించింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 14,355 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.అయితే మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు భారి లాభాలతో ఆరంభమవ్వటం వలన మన మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ గరిష్ఠంగా 370 పాయింట్లు లాభపడి 14,727 వద్ద చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో ముగిసింది.
నేటి మార్కెట్లో మిడ్ క్యాప్ రంగం 1.01 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 0.3 % వృద్ధిని సాధించింది. రియాల్టీ ఇండెక్స్ 4.5, టెక్ 1.56 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ మాత్రం 0.15 శాతం మేరకు క్షీణించింది.
సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే DLF 4.8%, MNM 3.2% చొప్పున లాభ పడగా HINDALCO 3.5 %, ONGC 1.4% అధికం గా క్షీణించాయి.
..............................................................................................