01-07-2009 :: 8 AM

మార్కెట్ నాడి

నిన్న మన మార్కెట్ల పై bears తమ పట్టు ని సాధించాయి. అమెరికా మార్కెట్లు , నిన్న విడుదలయిన వినియోగ దారులు విశ్వాస సూచీ ప్రతికూలం గా ఉండటం తో, కోల్పోయాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉండటం కూడా భల్లూకల కి మరింత సహాయం అందించ నున్నాయి. బడ్జెట్ నిరుత్సాహకరం గా ఉండవచ్చన్న అంచనాలతో మార్కెట్లు సతమత మౌతున్న నేపథ్యం లో నేడు మన మార్కెట్లు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. సెన్సెక్స్ నకు 14250 పాయింట్ల వద్ద మంచి మద్దత్తు ఉండటం కొంత ఊరట కలిగించే అంశం.

బడ్జెట్ పైన ఆశలు సన్న గిల్లుతున్న దృష్యా , ఒక వేళ నేడో, రేపో మార్కెట్లు పెరిగితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఉత్తమం.

  • నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14493
  • అవరోధం : 14503-14686 -14880
  • మద్దత్తులు : 14346-14234- 14004

...........................................................................................................................