- 30-06-2009 :: 6 Pm
- మార్కెట్ రిపోర్ట్
- నేడు మార్కెట్ లో భల్లూకాలు ( Bears ) వీర విహారం చేసాయి. పార్లమెంటు లో వచ్చే సోమవారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల సందర్భం గా నేడు మార్కెట్లో భారి ప్రాఫిట్ బూకింగ్ జరిగింది. ఈ సారి బడ్జెట్ జన రంజకం గా ఉండనున్నదన్న అంచానాల తో ట్రేడర్లు ప్రాఫిట్ బూకింగ్ కి దిగారని వార్త. పైగా సంస్కరణల విషయం లో, ముఖ్యం గా ఇన్సురన్సు సంస్కరణ లో జాప్యం జరుగనున్నదన్న వార్త కూడా మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీసింది. నేడు సెన్సెక్స్ 292 పాయింట్లు కోల్పోయి 14493 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ సుమారు 100 పాయింట్లు కోల్పోయి 4291 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.94 శాతం క్షీణించింది. కాగా స్మాల్ క్యాప్ 2.51 శాతం కోల్పోయింది. నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు భల్లూకల దెబ్బ కి హతోస్మి అనటం విశేషం. నేడు రియాల్టి రంగం అత్యధికం గా 7.4 శాతం నష్టపోయింది. మెటల్స్ రంగం 3.4 శాతం మెరుపుని కోల్పోయింది. సెన్సెక్స్ స్టాకు లలో DLF 8 %, TATA MOTORS 7.2 % అత్యధికం గా నష్ట పోయిన షేర్లు గా నిలిచాయి. కాగా , HERO HONDA 1.1 %, TCS 1 % స్వల్ప లాభాలను ఆర్జించాయి.
................................................................................................