మార్కెట్ ముందు చూపు
(29-06-2009 నుండి 03-07-2009 వరకు )
గత వారం ఒడిదుకులకు లోనయిన మన మార్కెట్లు ఈ వారం బడ్జెట్ అంశాల మీద ద్రుష్టి సారించ నున్నాయి . ఈ వారం విడుదల కా నున్న economic survey మన మార్కెట్ల దిశను నిర్దుష్టం గా నిర్ధారించ నున్నాయి. ఈ వారం రైల్వే మంత్రి ప్రవేశ పెట్ట బోయే రైల్ బడ్జెట్ , కొన్ని రైల్ సంబంధిత స్టాకు లను ప్రతి సారి లాగే , ఈ సారి కూడా ప్రభావితం చేయనున్నాయి. మా అంచనా ప్రకారం , ఈ సారి రైల్ బడ్జెట్ జనాకర్షణ గా ఉండే అవకాశం ఎక్కువ. ప్రయాణికుల కి మౌలిక సదుపాయాలు, ప్యాసింజెర్ బోగీల పునర్వ్యవస్థ, కొత్త కర్మాగారాల నెల కొల్పటం , వంటి అంశాలపై రైల్ బడ్జెట్ ద్రుష్టి పెట్టనున్నది. ఆర్ధిక మాంద్యం కారణం గా క్యాపిటల్ గూడ్స్ రంగం లో పెట్టుపడుల వలన ఉద్దీపన కలిగించే విధం గా రైల్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
మార్కెట్ల పయనం గురించి చర్చిస్తే, టెక్నికల్ గా గత వారం సెన్సెక్స్ 14200 మరియు 14002 పాయింట్ల కీలక మద్దత్తు నిలబటటం తో మార్కెట్లు ప్రస్తుత స్థాయి నుండి భయంకరంగా పడిపోయే అవకాశం తక్కువ అని చెప్పవచ్చు.
ఈ వారం , ముందుగా సెన్సెక్స్ సుమారు 15162 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది. ఆ తరువాత economic survey లో వెల్లడి కానున్న అంశాలు మార్కెట్ల సెంటిమెంట్ ని ప్రభావితం చేయనున్నది. Economic survey సానుకూలం గా ఉంటే మార్కెట్లు మరింత ముందుకి దూసుకు వెళ్లనున్నాయి. ఈ పక్షం లో మార్కెట్లు 15542 పాయింట్ల వరకు ఎగబాక వచ్చు. సెన్సెక్స్ నకు 15661 పాయింట్ల వద్ద తీవ్ర అవరోధం ఉన్నది. ఈ అవరోధం నిర్వివాదం గా దాటాలంటే బడ్జెట్ ప్రస్తావనలు కీలకం .