గత వారం మార్కెట్లు

(22/6/2009 నుండి 26/6/2009 వరకు )

ఈ వారం మార్కెట్లు స్వల్పం గా లాభాలను నమోదు చేసాయి. గత ఐదు రోజుల లో సెన్సెక్స్ 1.7% వృద్ధి చెంది 14764. 64 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 1.4% వృద్ధి ని నమోదు చేసి 4375.50 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ జూనియర్ 4 %, CNX మిడ్ క్యాప్ 3.8%, BSE స్మాల్ క్యాప్ 3.2 % వృద్ధిని నమోదు చేసాయి.

మేము గత ఆదివారం సూచించి నట్లు మార్కెట్లు లాభ నష్టాలను ఎప్పడి కప్పుడు సరిసమం చేసుకుంటూ పయనిస్తుంది అని తెలియచేయగా మార్కెట్లు మరొక సారి మా అంచనా ప్రకారం మార్కెట్లు నడుచుకున్నాయి. ఈ సందర్భం లో సెన్సెక్స్ నకు 14200 మరియు 14002 పాయింట్ల వద్ద గట్టి మద్దత్తు ఉన్నదని తెలియచేయగా ఈ వారం సెన్సెక్స్ కనిష్టం గా 14016 వరకు ఒక దశ లో పడిపోయింది అన్న విషయం గమనార్హం.

రోజు వారి మార్కెట్ల ప్రస్థానం ఈ విధం గా ఉండింది.

సోమవారం : ప్రారంభం ట్రేడ్‌లోనే సెన్సెక్స్ గరిష్ఠంగా 14,668 వద్దకు మా అంచనాలకు అనుగుణం గా చేరుకుంది. ఇది మేము సూచించిన 14686 పాయింట్ల అవరోధం అని గుర్తించాలి .అయితే ఆ తర్వాత లాభార్జన కోసం క్రయవిక్రయాలు సాగడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 196 పాయింట్లు కోల్పోయి 14,326 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 4,235 వద్ద ముగిసింది.మిడ్ క్యాప్ రంగం 0.57 % నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.33 % నష్టపోయింది .

మంగళవారం :ఉదయం భారి నష్టాల తో ప్రారంభమైన మన మార్కెట్లు చివరకు మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 2 పాయింట్ల నష్టం తో ముగియగా , నిఫ్టీ 12 పాయింట్ల లాభం తో 4547 పాయింట్ల వద్ద ముగిసింది.మధ్యాహ్న తాజా ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 14,394 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. సెన్సెక్స్ పుంజుకునేందుకు రిలయన్స్ కంపెనీ వాటాలు దోహదం చేశాయి. కానీ చివరికి 2 పాయింట్లు స్వల్ప నష్టంతో సెన్సెక్స్ ముగిసింది.మిడ్ క్యాప్ రంగం 0.24 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 0.13 % బలహీన పడింది.

బుధ వారం : ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై క్రమంగా నష్టాలలోకి జారుకున్నాయి. మధ్యాన్నం తరువాత ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన, తాజా కొనుగోళ్ళ వలన మార్కెట్లు మరల పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 99 పాయింట్ల లాభాం తో 14423 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్లు లాభ పడి 4293 వద్ద ముగిసింది.మిడ్ క్యాప్ 2.38 %, స్మాల్ క్యాప్ 2.26 % లాభాలను ఆర్జించాయి.

గురువారం : ఉదయం నిలకడగా ప్రారంభమైన మార్కెట్లు , మధ్యాన్నం జూన్ 13 నకు సంబంధించిన ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడ గానే నష్టాల బాట పట్టాయి. ఈ సారి ద్రవ్యోల్బణం 1.14 % ప్రతివ్రుద్ధిని సాధించాయి. గత వారం వెలువడిన ఫలితాల తో పోలిస్తే గత వారం ద్రవ్యోల్బణం -1.61% గా ఉండింది. F & O ముగింపు సందర్భం గా నష్టాలు మరింతగా పెరిగాయి.సెన్సక్స్ చివరికి 14346 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 4242 ముగిసింది.

శుక్రవారం : మార్కెట్లు ఆరంభం నుండే లాభాలను సాధించటం విశేషం. సెన్సెక్స్ భారి గా 419 పాయింట్లు లాభ పడి 14765 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 134 పాయింట్లు లాభ పడి 4375.5 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 2.4 % వృద్ధి చెందగా ,స్మాల్ క్యాప్ రంగం 1.89 % లాభ పడింది.

ఈ వారం A గ్రూపు స్టాకు లలో Suzlon 11 %,AXIS BANK 8.3%,ACC 7% లాభపడగా SUN PHARMA 13 %, NALCO 11 %, RANBAXY 9 % ,TATA STEEL 6 % క్షీణించాయి.

రంగాల వారిగా పరిశీలిస్తే BSE క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 6.8 % వృద్ధిని నమోదు చేసింది. ఇందుకు LNT 7.5%, BHEL 5.5% వృద్ధి తో సహాయ పడ్డాయి . ఐ. టి. రంగం ౩.2 % వృద్ధి ని నమోదు చేసి రెండా స్థానం లో నిలిచింది. TCS 4.8%, INFOSYS 3.8 % లాభపడటం విశేషం .

మిడ్ క్యాప్ స్టాకు ల లో BARTRONICS ఏకంగా ౩౦ % ఎగబాకింది. IL&FS INVESTSMART, IVRCL INFRA, CMC సుమారు సుమారు 23 ~ 28 % వృద్ధి ని నమోదు చేసాయి.

స్మాల్ క్యాప్ రంగం లో RENAISSANCE JWELLERY 44 % వృద్ధిని నమోదు చేసి మార్కెట్ ని ఆశ్చర్య పరిచింది. కాగా INSECTICIDE INDIA, REI AGRO 33%, 20 % వృద్ధిని నమోదు చేసింది .

....................................................................