30-06-2009 :: 8 AM

మార్కెట్ నాడి

నేడు మన మార్కెట్లు బడ్జెట్ అంచనాలతో ట్రేడ్ అవ్వనున్నాయి. ప్రపంచ మార్కెట్లు , ముఖ్యం గా అమెరికా మార్కెట్లు గత రాత్రి పేలవం గా ముగియటం, ఆసియా మార్కెట్లు కూడా దాదాపు ఫ్లాట్ గా పయనిస్తూ ఉండటం వంటి అంశాలు పరిశీలిస్తే, ఆసియా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ల పై ఉదయం ఉండబోదని చెప్పవచ్చు.

టెక్నికల్ గా చార్ట్లు బలహీన పడుతున్నాయి. మార్కెట్ల లో బడ్జెట్ విశేషాలు వెలుగు లోకి వస్తే తప్ప మార్కెట్లు నేడు కూడా నిన్నటి లాగ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. నేడు సెన్సెక్స్ కి 14960 పాయింట్ల వద్ద మరొక సారి అమ్మకాల వత్తిడి కి లోనవ్వనున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14786
  • అవరోధాలు : 14888-14930-15088
  • మద్దత్తులు : 14757-14686-14534-14243

..........................................................................................