29-06-2009:: 6:15 pm

మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లు , మా అంచనాలకు అనుగుణం గా మరొక సారి నడుచుకున్నాయి. మేము నేటి ఉదయమే సూచించినట్లు స్వల్ప లాభాలను నమోదు చేస్తూ ముగిసాయి. నేడు సెన్సెక్స్ 21 పాయింట్లు లాభ పడి 14786 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 15 పాయింట్లు లాభ పడి 4391 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మార్కెట్లో bears మరియు bulls సమ ఉజ్జీలు గా నిలిచాయి . ఉదయం భల్లూకాలు మార్కెట్ల పై తమ ప్రభావాన్ని చూపాయి. మార్కెట్లు ఒక దశ లో క్షీణించి 14685.45 పాయింట్ల వరకు చేరుకుంది. ఇది సరిగ్గా మేము సూచించిన 14686 పాయింట్ల మద్దత్తు స్థాయి అని గమనించాలి. ఐతే మధ్యాన్నం యూరోపియన్ మార్కెట్ల నుండి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో రియాల్టీ స్టాకుల్లో కొనుగోళ్లు భారీగా సాగాయి. దీంతో సెన్సెక్స్ తిరిగి లాభాల గాడిన పడింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 270 పాయింట్లు బలపడి 14,995 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. కానీ, మార్కెట్ ముగింపు సమయంలో జరిగిన విక్రయాలు వలన సెన్సెక్స్‌ను తిరిగి నష్టాల సమీపానికి చేర్చాయి. చివరికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో ముగిసింది.

నేటి మార్కెట్లో మిడ్ క్యాప్ రంగం 1.14 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 1.5 % వృద్ధిని సాధించింది.

కన్‌స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 4 శాతం, రియాల్టీ ఇండెక్స్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి.కాగా ఐటీ ఇండెక్స్ మాత్రం 2 శాతం మేరకు క్షీణించింది.

నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకు ల లో Sterlite industries 5.7 % అత్యధికం గా వృద్ధి చెందగా , DLF 3.8 % లాభనమోదు చేసింది. Tata Motors భారిగా 7.8 % నష్టాలను నమోదు చేసింది. Sun Pharma మరొక సారి నష్టాల తో ముగుస్తూ ౩.5 % క్షీణించింది.

.................................................................................................