26-06-2009 :: 8 AM

మార్కెట్ నాడి

మన మార్కెట్లు నిన్నటి దిశాహీన సంచారానికి నేటు స్వస్తి పలికే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లు , ముఖ్యం గా అమెరికా మార్కెట్లు నిన్న లాభ పడటం , నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల లో ప్రస్థుతం పయనిస్తూ ఉండటం మన మార్కెట్లకి శుభసూచకం.

F & O ముగిసింది కనుక ఇక మార్కెట్ బడ్జెట్ మీద ద్రుష్టి సారించ నున్నది. బడ్జెట్ ప్రాభావం మార్కెట్ల పై ఎ విధగా ఉండబోతున్నదో నేటి ట్రెండ్ మనకు చుక్కాని లా ఉపయోగ పడనున్నది.

నేటి నుండి నిఫ్టీ ,సెన్సెక్స్ ఫ్రీ ఫ్లోట్ విధానం అవలంభించ నున్నది. దీని ప్రభావం వలన సెన్సెక్స్ లో కంపనీ లకు ఆపాదించే ప్రాముఖ్యత ( weigtage) , ఆ యా కంపెనీలకు సంభందించిన అన్ని షేర్ల లో ట్రేడ్ అయ్యే షేర్ల నిష్పత్తి ప్రకారం మీద ఆధారపడి ఉంటుంది. దీని వలన ప్రభుత్వ రంగ కంపనీ షేర్లు సెన్సెక్స్ లో తమకున్న weightage ను స్వల్పంగా కోల్పోనున్నాయి.

మా అంచనా ప్రకారం నేడు మార్కెట్లలో బుల్ల్స్ కొంత పట్టు ని సాధించ నున్నాయి. నిన్నటి నష్టాలను పూరించుకునే దిశ గా మార్కెట్లు నేడు ముందంజ వేసే అవకాశం ఉంది. వారాంతం కనుక మార్కెట్ల ముగింపు సమయం లో కొంత ఓడిడుడుకులకి లోనయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14346
  • అవరోధం : 14503-14686
  • మద్దత్తులు : 14234- 14004 -13886

  • ..........................................................