26-06-2009:: 4:30pm
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు భారి గా పెరిగి పడి ఈ వారాన్ని లాభాల తో ముగించాయి. ప్రపంచ మార్కెట్ల వాతావరణం కూడా సానుకూలం గా ఉండటం తో మార్కెట్ల లో నందులు ( బుల్ల్స్ ) విజయ భేరి మ్రోగించాయి. నేడు మార్కెట్లు గత నాలుగు రోజులుగా సాగుతున్న అనిశ్చిత వీడి స్పష్టమైన ఒరవడి సృష్టించనున్నట్లు మేము ఉదయమే సూచించటం గమనార్హం. నేడు ,మా అంచనాలకు అనుగుణం గా మరొక సారి మార్కెట్లు లాభాల బాట లో పయనించాయి.
నేడు మార్కెట్లు ఆరంభం నుండే లాభాలను సాధించటం విశేషం. నేడు సెన్సెక్స్ భారి గా 419 పాయింట్లు లాభ పడి 14765 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 134 పాయింట్లు లాభ పడి 4375.5 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 2.4 % వృద్ధి చెందగా ,స్మాల్ క్యాప్ రంగం 1.89 % లాభ పడింది.
రంగాల వారిగా పరిశీలిస్తే నేడు హెల్త్ కేర్ రంగం మినహా అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. ఈ రంగం 1.49 % క్షీణించింది. కాగా బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 4.31 % వృద్ధి పొందగా క్యాపిటల్ గూడ్స్ రంగం 4.17% ఎగబాకింది.
నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకు ల లో ICICI BANK 7.96 %, STERLITE INDUSTRIES 7.66 % లాభ పడగా SUN PHARMA భారిగా 12.17 % నష్టాలను చవిచూసింది. RANBAXY 4.37% నష్టపోయి SUNPHARMA కి తోడుగా నిలిచింది.
........................................................................................................