25-06-2009 :: 6: 30 PM
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు BULLS కి BEARS కి నడుమ చిక్కుకొని సతమతమయ్యాయి. నేటి ఉదయం లాభాల తో ప్రారంభమయిన సెన్సెక్స్ మేము సూచించిన 14534 పాయింట్ల అవరోధం దరి దాపులలో మధ్యాన్నం వరకు సంచరించింది. ఐతే మధ్యాన్నం జూన్ 13 నకు సంబంధించిన ద్రవ్యోల్బణ ఫలితాలు వెలువడ గానే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ సారి ద్రవ్యోల్బణం 1.14 % ప్రతివ్రుద్ధిని సాధించాయి. గత వారం వెలువడిన ఫలితాల తో పోలిస్తే గత వారం ద్రవ్యోల్బణం -1.61% గా ఉండింది.
సాయంత్రం చివరి గంటల్లో , F & O ముగింపు సందర్భం గా నష్టాలు మరింతగా పెరిగాయి. దీంతో 14261 వద్దకు సెన్సెక్స్ కనిష్ఠంగా పడిపోయింది. ఇది మేము సూచించిన మద్దత్తు స్థాయి 14243 కి అతి సమీపం అని గుర్తించాలి. లాభార్జన కోసం క్రయవిక్రయాలు జరగడంతో సెన్సెక్స్ ఈ మేరకు నష్టాలు చవిచూసాయి . సెన్సక్స్ చివరికి 14346 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 4242 ముగిసింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ప్రధానంగా ఆటో, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్, పీఎస్‌యూ, కన్స్యూమర్ డ్యూరబుల్స్లు నష్టాలు చవిచూశాయి. ఆటో, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్‌లు మాత్రమే 2 శాతం మేరకు క్షీణించాయి. కాగా రియాల్టి 0.53 % , బ్యాంకింగ్ 0.38 % వరకు క్షీణించాయి.
నేడు మిడ్ క్యాప్ రంగం ౦.20 % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 0.45% నష్టపోయింది.
ఇక స్టాకు లు వారి గా చూస్తె , నేటి సెన్సెక్స్ స్టాకు ల లో HDFC 3%, JP అసోసియేట్స్ 2 % లాభాలను ఆర్జించాయి. కాగా TATA MOTORS 5.4 %, సన్ PHARMA 3.5 % నష్ట పోయాయి.
............................................