24-06-2009 :: 4:45pm
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు మేము సూచించిన విధం గా ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభామయి క్రమంగా నష్టాలలోకి జారుకున్నాయి. మధ్యాన్నం తరువాత ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన, తాజా కొనుగోళ్ళ వలన పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 99 పాయింట్ల లాభాం తో 14423 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్లు లాభ పడి 4293 వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ ఒక దశ లో కనిష్టం గా 14207, గరిష్టం గా 14479 పాయింట్లను నమోదు చేసింది. నేటి ట్రేడింగ్ లో ,ఉదయమే మేము చర్చించినట్లు ,14230 పాయింట్ల మద్దత్తు నిలవటం విశేషం.
నేడు మిడ్ క్యాప్ 2.38 %, స్మాల్ క్యాప్ 2.26 % లాభాలను ఆర్జించాయి.
నేటి ట్రేడింగ్ లో కేవలం బ్యాంకింగ్ రంగం 0.12 % నష్టాన్ని చవిచూసింది. కాగా పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 2.82 %, 2.52 % లాభాలను ఆర్జించాయి.
సెన్సెక్స్ స్టాకులను పరిశీలిస్తే Jaiprakash associates 6.01 %, sun pharma 5 % అత్యధికం గా లాభాలను నమోదు చేయగా , HDFC BANK 1.97%, HDFC 1.96 % అధికం గా నష్టపోయిన స్టాకు లు గా నిలిచాయి.
- .............................................