23-06-2009 :: 8AM

మార్కెట్ నాడి

నేడు మార్కెట్ల లో మరొక సారి భల్లూకాలు( BEARS ) తమ సత్తా చాటనున్నాయి. నిన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ప్రకారం ఈ సారి బడ్జెట్ జనరంజకంగా ఉండ గలదన్న అంచనా , ముఖ్యం గా సబ్సిడీ ఆహారం మున్నగు అంశాలు పరిశీలిస్తే, ఈ సారి బడ్జెట్ లోటు మరింత తీవ్రం కానున్నదనన్న అనుమానాలు కలుగక మానవు. వాస్తవాలు ఎలావున్నా, ఇటువంటి సంశయాలు మార్కేట్లని అతలాకుతలం చేయవచ్చు.

ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరంగా బలహీనపడటం -ముఖ్యం గా అమెరిక S & P 500 అతి కీలక 900 పాయింట్లకంటే దిగజారటం- అంటే గత రెండు నెలలలో అత్యధిక నష్టాలు నమోదు కావడం , ఆసియా మార్కెట్లు సైతం నష్టాల ఒరవడి సృష్టించటం వంటి అంశాలు పరిశీలిస్తే , నేడు మన మార్కెట్లో షాట్ లు తీవ్రతరం అయ్యేఅవకాశం ఉంది.

ప్రధానం గా నేడు మన మార్కెట్లు నష్టపోయే ఆస్కారం ఉంది. మధ్యాన్నం తరువాత ఐరోపా మార్కెట్లు కూడా నష్టాలలో ఉంటే , మార్కెట్లలో అమ్మకాల వత్తిడి జోరందుకోవచ్చు.చివరి క్షణాలలో మార్కెట్ల లో షార్ట్ కోవేరింగ్ జరిగే అవకాశం ఉంది. ఐతే దీర్ఘకాలిక మదుపరులకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే సెన్సెక్స్ నకు 14004 పాయింట్ల వద్ద బలమైన మద్దత్తు ఉంది. కనుక మార్కెట్లు ఎంత నష్టపోయినా , ఈ మద్దత్తు వద్ద బుల్ల్స్ మరొక సారి రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు నిన్న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచ మార్కెట్లు 4.1 % బలహీనపడనున్నట్లు, కేవలం చైనా 6.5 % , ఇండియా 5.1% వృద్ధిని సాధించనున్నట్లు సమాచారం. ఈ అంశం కూడా మార్కెట్లకు ఉత్తేజాన్ని కలుగ చేయవచ్చు.

  • నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14326
  • అవరోధం : 14503-14686
  • మద్దత్తులు : 14234- 14004 -13886
  • ............................................................................