- 22-06-2009 :: 6:40 PM
- మార్కెట్ రిపోర్ట్
- సెన్సెక్స్ మళ్లీ గత వారం కథనే పునరావృతం చేసింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 196 పాయింట్లు కోల్పోయి 14,326 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 4,235 వద్ద ముగిసింది.ఈ రోజు ఉదయం 70 పాయింట్లు లాభంతో 14,591 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభం ట్రేడ్‌లోనే సెన్సెక్స్ గరిష్ఠంగా 14,668 వద్దకు మా అంచనాలకు అనుగుణం గా చేరుకుంది. ఇది మేము సూచించిన 14686 పాయింట్ల అవరోధం అని గుర్తించాలి .అయితే ఆ తర్వాత లాభార్జన కోసం క్రయవిక్రయాలు , ఐరోపామార్కేట్లన్ని నష్టాలతో సాగడంతో మధ్యాహ్న ట్రేడ్‌లో ఇండెక్స్ క్షీణించడం మొదలెట్టింది. మధ్యాహ్నపు ట్రేడ్‌లోనే 14,270 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.
- నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ రంగం 0.57 % నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.33 % నష్టపోయింది .
- చమురు మరియు సహజవాయువులు, మెటల్ (లోహం), విద్యుత్ రంగాల్లో లాభాల కోసం తెగబడటం.. విదేశీ సంస్థాగత నిధులు మరియు రీటైల్ ఇన్వెస్టర్లు విక్రయాలను జరపడంతో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది. బీఎస్ఈ చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 3 శాతం చొప్పున బలహీనపడింది.కాగా పవర్ రంగం 2.5 % క్షీణించింది. FMCG 0.5 %, క్యాపిటల్ గూడ్స్ 0.4 % స్వల్పంగా లాభాలను నమోదు చేసింది.
- ఇక స్టాకు ల వారి గా చూస్తె SENSEX స్టాకు ల లో ICICI BANK 1.8 %, ITC 1.6 % లాభపడ్డాయి. కాగా TATA POWER-4.9 %, GRASIM-4.6% నష్టపోయాయి.
- .....................................................................