23-06-2009 :: 6:40 PM
మార్కెట్ రిపోర్ట్
ఉదయం భారి నష్టాల తో ప్రారంభమైన మన మార్కెట్లు ,నేడు చివరకు మిశ్రమంగా ముగిసాయి. నేడు సెన్సెక్స్ 2 పాయింట్ల నష్టం తో ముగియగా , నిఫ్టీ 12 పాయింట్ల లాభం తో 4547 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మార్కెట్లు మేము సూచించినట్లు నడుచుకున్నయనటం లో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. నేడు సెన్సెక్స్ మా అంచనాలకు అనుగుణం గా భారి నష్టాలతో కనిష్టం గా 14016 పాయింట్ల వరకు పడిపోయింది. మేము సూచించిన 14004 పాయింట్ల మద్దత్తు స్థాయి నిలవడం తో మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. తరువాత మా అంచనాలకు అనుగుణంగా ఈ స్థాయి లో బుల్ల్స్ మరల రంగ ప్రవేశం చేసాయి. ఈ స్థాయి లో కంపెనీల షేర్లలో కొనుగోళ్లు భారీ స్థాయిలో జరగడంతో మధ్యాహ్నపు తాజా ట్రేడింగుల్లో సెన్సెక్స్ పుంజుకుంది. ఇది కూడా మేము సూచించినట్లే జరగటం విశేషం .మధ్యాహ్న తాజా ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 14,394 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. సెన్సెక్స్ పుంజుకునేందుకు రిలయన్స్ కంపెనీ వాటాలు దోహదం చేశాయి. కానీ చివరికి 2 పాయింట్లు స్వల్ప నష్టంతో సెన్సెక్స్ ముగిసింది.బీఎస్ఈ చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 2 శాతం లాభపడగా, బీఎస్ఈ బ్యాంకెక్స్ 2 శాతం మేరకు క్షీణించింది. నేడు మిడ్ క్యాప్ రంగం 0.24 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం 0.13 % బలహీన పడింది.
నేడు సెన్సెక్స్ స్టాకు ల లో Grasim 4.1 % , ONGC 3.3 % అత్యధికం గా లాభ పడగా , ICICI BANK 4 % , HDFC BANK 3.6 % నష్టాలను నమోదు చేసాయి.
- ......................................................