22-06- 2009 :: 8 AM

మార్కెట్ నాడి

గత శుక్రవారం ముగింపు సమయం లో మార్కెట్లు కనపరిచిన వేడి నేడు కూడా మనకి కనిపించవచ్చు. ప్రపంచ మార్కెట్లు లాభ బాట లో ఉండటం మన మార్కెట్లకి సానుకూల అంశం గా ఉన్నది.

RIL- RNRL వివాదం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దీవరా అంబాని సోదరుల తో జరిపిన చర్చ ఫలితం గా ఈ వివాదాని కి త్వరగా పరిష్కారం లభించవచ్చన్న అంచనాలు కూడా నేడు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింప నున్నాయి .

ఇక జూలై 6 న ప్రకటించ నున్న బడ్జెట్ కూడా మార్కెట్లలో చర్చనీయ అంశం గా మారనున్నది. కార్పొరేట్ రంగాలలో ని నిపుణులు తత్సంబంధిత మంత్రిత్వ శాఖల తో జరిపే మంతనాలు , మంత్రులు ఇచ్చే హామీ లు మున్నగు అంశాలు మార్కెట్లకి స్టిరోయిడ్లు( " STEROIDS") ఇవ్వనున్నాయి.

ఐతే మన మార్కెట్ల ప్రారంభ సమయానికి ఆసియా మార్కెట్లు నష్టాలలో ఉంటే మాత్రం మన మార్కెట్లకి నేడు ఒడిదుడుకులు తప్పవు. ఆసియా మార్కెట్ల గమనాన్ని కనిపెడుతూ నేడు ఉదయం పోసిషన్ తీసుకోవటం శ్రేయస్కరం.

నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

  • గత ముగింపు: 14522

  • కీలక అవరోధాలు : 14686-14757-14888

  • కీలక మద్దత్తు స్థాయిలు : 14243- 14004-13886-13781

  • ........................