• మార్కెట్ ముందు చూపు
  • (22-06-2009 నుండి 26-06-2009 వరకు )
  • మార్కెట్లు గత వారం సుదీర్ఘ జైత్రయాత్ర కి స్వస్తి పలికింది. ఈ వారం మార్కెట్ల లో బుల్ల్స్ తమ పట్టు ని మరొక సారి నిలుపుకునే ప్రయత్నం చేయనున్నాయి. ఐతే ఇప్పటికే మార్కెట్లు భారిగా పెరగటం, ప్రపంచ మార్కెట్ల లో కొంత సబ్తత చోటు చేసుకోవటం వంటి అంశాలు bears కి మద్దత్తు ప్రకటించనున్నాయి. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ల తీరుని గమనిస్తే కొంత నిరాశాకరమనే చెప్పవచ్చు. ఊరుట కలిగించే వార్తలు సైతం మార్కేట్లని కూలదోస్తున్నాయి. ఉదాహరణకి అమెరికా బ్యాంకులు తమకు అందించిన ప్రభుత్వ సహాయాన్ని తిరిగి ఇచ్చివేసే పరిస్థితి కాన వస్తోందన్న ఊరుట కలిగించే వార్తలు సైతం మదుపరులో అమ్మకపు ధోరణి పెంచుతోంది . ఈ అంశాలను పరిశీలిస్తే గతం లో మేము చర్చించిన " risk aversion " ( రిస్క్ విముఖత ) మార్కెట్లను పెద్దగా ముందుకు సాగనివ్వక పోవచ్చు. మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తుంటే తమ పొసిషన్స్ ఎగ్జిట్ అయ్యే ఆలోచనల తో ట్రేడేర్లు ఉండే అవకాశం ఉంది. ఇందు చేత మార్కెట్లు ఓడిదుదుకులతో లాభ నష్టాలను ఎప్పటికప్పుడు సమం చేసుకుంటూ స్థిరత్వం వైపుకు పయనించే అవకాశం ఉంది. టెక్నికల్ గా పరిశీలించిన సెన్సెక్స్ మార్పులలో standard deviation కూడా తగ్గుముఖం పడుతోంది. కాబట్టి ఈ వారం మార్కెట్లు స్థిరత్వం దిశగా పయనించవచ్చు. ఐతే ఈ వారం ముఖ్యంగా వేచిచూడ వలసిన అంశాలలో యూనియన్ బడ్జెట్ చమక్కులు వలన సెన్సెక్స్ లో చలనం కనిపించవచ్చు. అదే విధం గా ఈ వారం 25 తేది న F & O ముగింపు వలన కూడా మార్కెట్ల లో జరిగే రోల్ ఓవర్లు బట్టి సూచిల గమనం ఆధారపడి ఉంటుంది. స్థూలం గా ఈ వారం సెన్సెక్స్ 13727--15106 మధ్య లో సంచరించ వచ్చు. 14200 మరియు 14002 పాయింట్ల వద్ద అతి బలమైన మద్దత్తు ఉండటం వలన మార్కెట్లలో పెను మార్పులు కనిపించక పోవచ్చు.
  • ఐతే ఈ వారం బడ్జెట్ ర్యాలీ ప్రారంభామేయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

  • ......................................................................................