- వారం సమీక్ష
- ( 15-06-2009 నుండి 19-06-2009 వరకు )
- సెన్సెక్స్ 14 వారాల జైత్ర యాత్ర కి ఈ వారం తెరపడింది. ఈ వారం సెన్సెక్స్ 15446 పాయింట్ల వద్ద ప్రారంభమయి , సోమవారం గరిష్టం గా 15600 పాయింట్లను చేరుకుంది. ఆ తరువాత బుల్ల్స్ మార్కెట్ పై తమకున్న పట్టు ని విడనాడాయి. ఈ విషయం మేము గత ఆదివారం " మార్కెట్ ముందు చూపు " లో ప్రస్తావించటం జరిగింది. ఈ వారం సెన్సెక్స్ మేము గత ఆదివారం సూచించినట్లు 15237 ~ 14265 పాయింట్ల మధ్య సంచరించింది. మేము సెన్సెక్స్ 15340 ~14248 మధ్య సంచరించే అవకాశం ఉంది అని మా విశ్లేషణ లో తెలియచేసాము. మా అంచనాలు నూటి కి నూరు పాళ్ళు నిజం చేస్తూ సెన్సెక్స్ పయనించటం విశేషం. మా పాఠకుల వచనం ప్రకారం " మా అంచనాల కి అనుగుణం గా అని అనే బదులు మా అనుజ్ఞ ని సెన్సెక్స్ శిరసావహి స్తోంది అని అనటం సముచితం " అన్న స్పందన ఈ సందర్భం లో తెలియ చేసేందుకు సంతోషిస్తున్నాము.
- ఇక ఈ వారం రోజు వారిగా సెన్సెక్స్ పయనం ఈ విధం గా ఉండింది.
- సోమవారం : నేడు మార్కెట్ల పతనం ప్రారంభమయ్యింది. రిలయన్స్ నకు బొంబాయి హై కోర్టు లో RIL -RNRL గ్యాస్ తాలూకు వివాదం లో చుక్కెదురు కావడం తో నేడు ఈ కౌంటర్ 7.48 % క్షీణించింది. దీనితో సెన్సెక్స్ , నిఫ్టీ లు కూడా భారిగా నష్టపోయాయి. ఇది ఇలా ఉండగా RNRL కౌంటర్ 24 % ఎగబాకింది. సెన్సెక్స్ 362 పాయింట్లు నష్ట పోయి 14875 పాయింట్లకు ముగియగా , నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 4484 వద్ద ముగిసింది.నేడు స్మాల్ క్యాప్ రంగం 2.14 % , మిడ్ క్యాప్ రంగం 2.33 % నష్టపోయింది.
- మంగళవారం : మార్కెట్లు భారి నష్టాల తో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు ఒక దశ లో 14622 పాయింట్ల వరకు నష్టపోయింది. ఐతే ఐరోపా మార్కేట్లు మధ్యాన్నం నిలకడ గా ప్రారంభమయి లాభాల బాటలో నడవటం , ఇదే సమయంలో బ్రిక్ దేశాల ప్రణాళికలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటన సాగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ వ్యాఖ్య మన మార్కెట్లను లాబాల బాట లో పయనింప చేసాయి
- బుధ వారం : ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ భారీగా క్షీణించడం మొదలెట్టింది. బ్రిక్ దేశాల సమావేశాల నేతృత్వాన సెన్సెక్స్ కొంత రికవరీ అయి లాభాల్లో పయనించిందిఅయితే ఆ లాభాలు ఎక్కువ సేపు నిలబడలేదు. అమెరికాలో మరింతగా క్షీణిస్తున్న వినియోగదారుల కొనుగోలు శక్తి, ఆదేశ ఆర్థిక నివేదికలపై ఆందోళనలు వెరసి ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపాయి. అలాగే కొత్త ఆర్థిక పరమైన నియంత్రణలను చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటన మార్కేట్లని ప్రభావితం చేసాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలహీన సంకేతాల ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలతో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి కూరుకుపోయాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 4,356 వద్ద ముగిసింది. కాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 435 పాయింట్లు కోల్పోయి 14,523 వద్ద నిలిచింది. మిడ్ క్యాప్ రంగం ౩.92 %, స్మాల్ క్యాప్ 3.74 % నష్టపోయాయి.
- గురు వారం : గురువారం విడుదలయిన ద్రవ్యోల్బణ ఫలితాలు మార్కెట్ ని దెబ్బ తీసింది. ద్రవ్యోల్బణం సున్నా కన్నా దిగువుకు పడిపోవడం దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో సెన్సెక్స్ నష్టాల్లో పయనించింది. దీనికి తోడు లాభార్జన కోసం విక్రయాలు జరగడంతో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 14265 పాయింట్ల వద్ద ముగిసింది.
- శుక్రవారం : రెండు రోజుల నష్టాల తరువాత మార్కెట్లు కొంత కోలుకున్నాయి . నేడు సెన్సెక్స్ 256 పాయింట్లు లాభ పడి 14522 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 62 పాయింట్లు లాభ పడి 4314 పాయింట్ల వద్ద ముగిసింది. ఇందుకు గాను ట్రేడింగ్ చివరి దశ లో షార్ట్ కవెరింగ్ దోహద పడింది. మిడ్ క్యాప్ రంగం 1.68 % వృద్ధి ని నమోదు చేయగా , స్మాల్ క్యాప్ రంగం 0.82 % లాభపడింది.
- ఈ వారం లో సెన్సెక్స్ 4.5% క్షీణించగా , నిఫ్టీ 5.7 % క్షీణించింది. కాగా SNP CNX DEFTY 6.7 % నష్టపోయింది. CNX మిడ్ క్యాప్ 4.2 %, స్మాల్ క్యాప్ 6.5 %, , నిఫ్టీ జూనియర్ 3 % నష్టాలను నమోదు చేసింది.
- ఇక రంగాల వారిగా పరిశీలిస్తే ఆయిల్ మరియు గ్యాస్ 10.5 % నష్టపోగా , మెటల్స్ 9.5 % నష్టపోయింది. కాగా బ్యాంకింగ్ రంగం 2.5 % లాభాలను ఆర్జించింది.
- సెన్సెక్స్ స్టాకు ల లో STERLITE IND- 15 %,ACC, NTPC - 11%, TATA STEEL , SAIL- 9.5 % TATA COMM- 9%, POWER GRID 10.5 % నష్టపోయాయి. కాగా SBI 5.5 % వృద్ధిని నమోదు చేసింది.
- మిడ్ క్యాప్ రంగం లో JET AIRWAYS -19 %, BHUSHAN STEEL- 18.5 %, TANLA -17.5 % నష్టాలను చవిచూడగా INDUS IND BANK-15 %, GREAT OFF SHORE -12 %, MPHASIS -10.5%,IDBI -8.5% లాభాలను నమోదు చేసాయి.
- .......................................................................