19-06- 2009 :: 5 :30PM

మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లు రెండు రోజుల నష్టాల తరువాత కొంత కోలుకుంది. నేడు సెన్సెక్స్ 256 పాయింట్లు లాభ పడి 14522 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 62 పాయింట్లు లాభ పడి 4314 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ సూచీలు మధ్య లో స్వల్ప ఒడిదుడుకులకు లోనయ్యి ఒక దశ లో 14180 పాయింట్ల వరకు కోల్పోయింది. ఐతే చివరకు మా అంచనాలకి అనుగుణంగా మరొక సారి నడిచి మేము ఉదయం సూచించిన రీతి లో షార్ట్ కవెరింగ్ వలన లాభం తో ముగిసాయి.

నేడు మిడ్ క్యాప్ రంగం 1.68 % వృద్ధి ని నమోదు చేయగా , స్మాల్ క్యాప్ రంగం 0.82 % లాభపడింది.

నేడు మార్కెట్ లో అన్ని రంగాలు లాభాలు ఆర్జించటం విశేషం . నేడు క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 4.58 % లాభాలను ఆర్జించింది. లాభాల లో రియాల్టి రంగం 3.13 % వృద్ధి చెంది రెండవ స్థానం లో నిలిచింది.

ఇక స్టాకుల వారిగా పరిశీలిస్తే , సెన్సెక్స్ స్టాకు ల లో టాటా స్టీల్ అధికంగా 5.85 % లాభ పడింది. కాగా NTPC 2.20 % నష్టపోయింది.

  • ................................................................