19-06- 2009 :: 8 am

మార్కెట్ నాడి

రెండు రోజుల భారి నష్టాల తరువాత మార్కెట్లు నేడు కొంత నష్టాలను పూరించు కునే ప్రయత్నం చేయనున్నాయి. ఇందుకు గాను ఆసియా మార్కెట్లు నేడు లాభా ల లో ఉండటం, గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా లాభ పడటం , అమెరికా ఆర్థిక పరిస్థితి కి సంబంధించిన గణాంకాలు ఆశాజనకం గా ఉండటం వంటి అంశాలు నేడు మన మార్కెట్లకి ఊరట కలిగించనున్నాయి. గత రెండు రోజులుగా మార్కెట్ లో ఏర్పడ్డ షార్ట్ పొసిషన్స్ కూడా , నేడు వారంతం కనుక కొంత కవర్ అయ్యే అవకాశాలున్నందున నేడు మార్కెట్లు పెరిగే అవాకశాలే ఎక్కువగా ఉన్నాయి.

టెక్నికల్ గా మన మార్కెట్లు మద్దతు స్థాయి వద్ద ఉండటం నేడు bulls కి ఉత్సాహం కలిగించే అంశం . సందర్భం లో మేము గత ఆదివారం " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో వారం సెన్సెక్స్ 15340 ~14248 మధ్య సంచరించే అవకాశం ఉంది అని తెలియచేయటం కూడా గమనార్హం.

  • నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు
  • గత ముగింపు : : 14266
  • అవరోధం : 14686 -14757-14930
  • మద్దత్తులు : 14234- 14004 -13886
  • ..............................................................................