18-06-2009:: 6:30 PM

మార్కెట్ రిపోర్ట్

నేడు మార్కెట్లకు మరొకసారి షాక్ తగిలింది.. సెన్సెక్స్ 257 పాయింట్లు కోల్పోయి 14,266 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 4,251 వద్ద ముగిసింది.

నేడు సెన్సెక్స్ మా అంచనా లకు అనుగుణం గా 14502 పాయింట్ వద్ద ప్రారంభమయ్యింది. మా అనాలిసిస్ ని మరొక సారి నిజం చేస్తూ మార్కెట్లు గరిష్టం గా 14631 పాయింట్ల వరకు పెరిగింది. మేము నేడు సెన్సెక్స్ 14520 ~ 14680 పాయింట్ల మధ్య సంచరించ వచ్చని ఉదయమే తెలియచేసాము. ఐతే నేటి మధ్యాన్నం విడుదలయిన ద్రవ్యోల్బణ ఫలితాలు మార్కెట్ ని దెబ్బ తీసింది. ద్రవ్యోల్బణం సున్నా కన్నా దిగువుకు పడిపోవడం దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో మళ్లీ సెన్సెక్స్ నష్టాల్లో పయనించింది. దీనికి తోడు లాభార్జన కోసం విక్రయాలు జరగడంతో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 14,188 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. మార్కెట్లు నష్టపోతే సుమారు 14240 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉందని కూడా మేము ఉదయమే తెలిచేయటం ఈ సందర్భం లో గమనార్హం. చివరకు సెన్సెక్స్ 14265 పాయింట్ల వద్ద ముగిసింది.

రియాల్టి , మెటల్ (లోహం) రంగాల స్టాకుల్లో భారీ విక్రయాలు జరిగాయి. దీంతో రెండో రోజు వరుసగా సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1.77 శాతం, నిఫ్టీ 2.40 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 6 శాతం, మెటల్ ఇండెక్స్ 5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. కాగా కేవలం ఐ. టి. మాత్రమె క్షేనిస్తున్న రూపాయి విలువ కారణంగా 0.17 % వృద్ధిని నమోదు చేసింది.

నేడు స్మాల్ క్యాప్ రంగం 3.7 క్షీణించగా మిడ్ క్యాప్ 2.87 % క్షీణించింది.

ఇక స్టాకు ల వారిగా పరిశీలిస్తే సెన్సెక్స్ స్తాకులలో ACC 8.2 %, JP ASSOCIATES 6.7 % నష్టపోయింది. కాగా SBI -2.3 %, SUN PHARMA 1.5 % అత్యదికంగా లాభ పడ్డ సెన్సెక్స్ స్టాకులు గా నిలిచాయి.

  • ....................................