17-06-2009 :: 8:30 am
మార్కెట్ నాడి
నిన్నటి భారి నష్టాల తరువాత మార్కెట్లు సహాయం కోసం ప్రపంచ మార్కెట్ల వైపు మరొక సారి ఎదురు చూడనున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. ఐతే నిన్న అమెరికా S & P నష్టపోయి 200 DMA వద్ద మద్దతు తీసుకొని మరల స్వల్ప లాభాలలో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయి క్రమంగా నష్టాలలోకి జారు కుంటున్నాయి. మన మార్కెట్లు నేడు పుంజుకోవాలంటే బడ్జెట్ సంబంధించిన అంశాలు వెలుగులోకి రావాలి.
సెన్సెక్స్ నిన్న అతి కీలక మద్దత్తు వద్ద ముగిసింది. ఈ మద్దత్తు నిలువక పొతే మార్కెట్లు నేడు మరింతగా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేడు మార్కెట్ ప్రారంభం అతి కీలకం . నేడు సుమారు 14500 పాయింట్ల వద్ద ప్రారంభమైతే మార్కెట్లు ప్రధానం గా 14520 ~ 14686 మధ్య సంచరించే అవకాశం ఉంది. కాని పక్షం లో నేడు 14240 పాయింట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 14523
- కీలక అవరోధాలు : 14686--14757-14888
- కీలక మద్దతులు : 14534-14240-14004
- ....................................................................................