• 17-06-2009 :: 8:25 am

  • మార్కెట్ నాడి

  • నిన్న అనూహ్య రీతి లో లాభ పడ్డ మన మార్కెట్లు, ఇదే ఉత్సాహం తో బడ్జెట్ ర్యాలీ ని ప్రారంభించే ప్రయత్నం చేయవచ్చు. నిన్నటి మార్కెట్ లో సెన్సెక్స్ నకు మరొక సారి 14686~14534 పాయింట్లు మద్దత్తు ఇవ్వటం తో టెక్నికల్ గా కనిష్ట స్థాయి సుమారు 14500 పాయింట్లని చెప్పవచ్చు. ఐతే నిన్నటి ర్యాలీ ఐ.ఎం.ఎఫ్ ప్రకటన మూలం గా ఏర్పడిన ర్యాలీ కాబట్టి దాని ప్రభావం నేడు కూడా మన మార్కెట్ల కి ఔషధం లాగా పనిచేయాలంటే ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ఉత్సాహకరంగా ఉండాలి. నిన్న అమెరికా మార్కెట్లు బలహీనమైన మాసిక PPI గణాంకాల వలన నష్టాలలో జారుకుంది. ఆసియా మార్కెట్లు కూడా నేడు మిశ్రమంగా ఉన్నాయి. ఈ అంశాలను పరిశీలిస్తే నేడు సెన్సెక్స్ పరస్పర విరుద్ధమైన సంఘటనల మధ్య చిక్కుకొని ఉంది. ఈ సందర్భంలో మన మార్కెట్లు తదుపరి దిశ ఏ విధం గా ఉంటుందో నేడు తెలియనున్నది . కాబట్టి నేడు మన మార్కెట్లకి అతి కీలకం అని చెప్పవచ్చు.
  • మా అంచనా ప్రకారం నేడు మార్కెట్లు కొంత ఒడిదుడుకుల తో పయనం సాగించినా , చాలా మటుకు BULLS తమ పట్టుని బిగించేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఇదే జరిగితే అతి త్వరలో బడ్జెట్ ర్యాలీ ప్రారంభం కానున్నది అని మనం అనుకోవచ్చు.
  • నేడు సెన్సెక్స్ నకు ముఖ్య మజిలీలు
  • గత ముగింపు : 14958
  • అవరోధాలు :14980--15160-15228 -15367
  • మద్దత్తు స్థాయిలు : 14875-14757-14620
  • ....................................................................