- 16-6-2009 :: 6:30 PM .
- మార్కెట్ రిపోర్ట్
- మార్కెట్లు నేడు ఉదయం , మా అంచనాలకు అనుగుణంగా భారి నష్టాల తో ప్రారంభమయ్యింది. మార్కెట్లు ఒక దశ లో 14622 పాయింట్ల వరకు నష్టపోయింది. ఐతే ఐరోపా మార్కేట్లు మధ్యాన్నం నిలకడ గా ప్రారంభమయి లాభాల బాటలో నడవటం , ఇదే సమయంలో బ్రిక్ దేశాల ప్రణాళికలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటన సాగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ వ్యాఖ్య మన మార్కెట్లను లాబాల బాట లో పయనింప చేసాయి. అలాగే జపాన్ ఆర్థికంగా కోలుకునేందుకు ఆ దేశ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ రెండింటితో పాటు.. సెమీ కండక్టర్ వృద్ధి చెందనున్నట్లు గార్టనర్ నివేదిక వంటి అంశాలు స్టాక్ మార్కెట్ లాభాల బాటను పట్టడానికి దోహదం చేసాయి.
- నేడు ఆసియా మార్కెట్లలో కేవలం మన మార్కేట్లు మాత్రమె లాభాలు ఆర్జించటం విశేషం. నేడు సెన్సెక్స్ 82 పాయింట్లు లాభ పడి 14958 పాయింట్ వడ ముగియగా నిఫ్టీ 34 పాయింట్లు వృద్ధి చెంది 4518 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఆయిల్ మరియు గ్యాస్ రంగం మినహా అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. ఆయిల్ రంగం సుమారు 11 % నష్టపోయింది. కాగా నేడు సెన్సెక్స్ లో బ్యాంకింగ్ రంగం , పి .ఎస్ . యు రంగం అధికం గా 2.26 % లాభ పడింది. నేడు మిడ్ క్యాప్ రంగం అధికంగా 2.21 % వృద్ధిని నమోదు చేయటం విశేషం. కాగా స్మాల్ క్యాప్ 2.13 % లాభపడింది ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే Reliance infra, SBI 6.1%, 4.1 % లాభపడ్డాయి. కాగా sterlite, Reliance 4.4 %, 1.8 % నష్టపోయాయి.
- ............................