బలహీనమైన ప్రపంచ మార్కెట్ల వలన నేడు మన మార్కెట్లు దివాలా తీసాయి. మేము ఊహించినట్లే నేడు మార్కెట్లు ఒడిదుడుకులతో ప్రారంభమయ్యింది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ భారీగా క్షీణించడం మొదలెట్టింది. బ్రిక్ దేశాల సమావేశాల నేతృత్వాన సెన్సెక్స్ కొంత రికవరీ అయి లాభాల్లో పయనించింది. ఈ అంశం గురించి మేము ఉదయమే ప్రస్తావించాము. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 14,996 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది.అయితే ఆ లాభాలు ఎక్కువ సేపు నిలబడలేదు. క్రమంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయింది. లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడింది. ఈ దశలో అమెరికాలో మరింతగా క్షీణిస్తున్న వినియోగదారుల కొనుగోలు శక్తి, ఆదేశ ఆర్థిక నివేదికలపై ఆందోళనలు వెరసి ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపాయి. అలాగే కొత్త ఆర్థిక పరమైన నియంత్రణలను చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటనకు ముందు తర్వాత కూడా ఆసియా మార్కెట్లు రెడ్ మార్కులోనే పయనించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలహీన సంకేతాల ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలతో భారత స్టాక్ మార్కెట్లు మధ్యాహ్న తాజా ట్రేడింగ్‌ల తర్వాత నష్టాల్లోకి కూరుకుపోయాయి.
దీంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 4,356 వద్ద ముగిసింది. కాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 435 పాయింట్లు కోల్పోయి 14,523 వద్ద నిలిచింది. టెక్నికల్ గా ఇది కనిష్ట స్థాయి అని కూడా మేము ముందే సూచించటం గమనార్హం.
నేడు మార్కెట్ లో అన్ని రంగాలు భారి గా నష్టపోయాయి. రియాల్టీ 5.90 % మెటల్స్ 5.63 % నష్టాలను నమోదు చేసి అత్యధిక నష్టాలను చవిచూసిన రంగాలు గా నిలిచాయి.
నేడు మిడ్ క్యాప్ రంగం ౩.92 %, స్మాల్ క్యాప్ 3.74 % నష్టపోయాయి. స్టాకులు వారిగా పరిశీలిస్తే నేడు సెన్సెక్స్ స్టాకు లలో టాటా పవర్ మినహా అన్ని స్టాకులు నష్టాలను చవిచూసాయి. టాటా పవర్ 0.03 % అతి స్వల్ప లాభం నమోదుచేసింది. కాగా టాటా స్టీల్ 7.52 % టాటా మోటార్స్ 7.36 % క్షీణించాయి.