ఈ వారం CORRECTION నకు మార్కెట్లు లోనుకానున్నాయి. అందుకు గాను , బహుశా , నేడు మార్కెట్లు BEARS కి స్వాగతం పలికే సూచనలు కనిపిస్తున్నాయి. మన దేశ ఆర్ధిక పరిస్థి ని సమీక్షిస్తే, ప్రణాలికా వ్యయం 1 లక్ష కోట్ల రూపాయల పెంపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యయం పేదలకు మూడు రూపాయలకే కిలో గోదుమలు , బియ్యం పంపిణి మున్నగు జనాకర్శ పధకాలకు వెచ్చించనున్నారు. దీని ప్రభావం వలన ఈ సారి బడ్జెట్ లోటు GDP లో 6 % నికి పెరగనున్నది. ఈ అంశం మార్కెట్ల ను కొంత నిరుత్సాహ పరచవచ్చు. ఐతే మన మార్కెట్లు తదుపరి గమనానికి ప్రపంచ మార్కెట్ల ప్రభావం కూడా ఉండనున్నది. కావున మన మార్కెట్ల ప్రారంభ సమయానికి ఆసియా మార్కెట్లు భారి లాభాల బాటలో నడవక పొతే నేడు మన మార్కెట్లలో భల్లూకాలు ( BEARS ) వీర విహారం చేసే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రపంచ మార్కెట్లు సహకరిస్తే నేడు మార్కెట్లు ఫ్లాట్ గా ముగియవచ్చు .మా అంచనాప్రకారం నేడు మార్కెట్ల లో భాల్లూకలేదే పై చేయి అవ్వనున్నది.