• మార్కెట్ ముందు చూపు
  • ( జూన్ 15 నుండి 19 వరకు )

  • మార్కెట్లు 14 వారాల వరుస లాభాల తరువాత మరొక వారం లో అడుగు పెట్ట నున్నాయి . గత వారం గమనిస్తే , మార్కెట్లలో ఇదివరకు ఉన్న దూకుడు తనం లేదనే చెప్పాలి. గత వారం స్మాల్ క్యాప్ రంగం భారి గా నష్ట పోయింది. ఐతే సెన్సెక్స్ స్టాకులు బలంగా ఉండటం తో దాని ప్రభావం మనకి పెద్దగా కనిపించలేదు. స్మాల్ క్యాప్ స్టాకు లలో కనిపించిన ప్రాఫిట్ బూకింగ్ ధోరణి ఈ వారం ఇతర రంగాలకి విస్తరిస్తుం దా అన్నేదే ప్రశ్న . ఈ అంశం లో ఈ వారం మన మార్కెట్లకి కీలక మైనదని వ్యవహరించ వచ్చు. మన మార్కెట్ల కి ప్రపంచ మార్కెట్లు సహాయ పడితే సుమారు 15742 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉంది. కాని పరిస్థితి గమనిస్తే ఇందుకు గాను అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కారణం సెన్సెక్స్ కి అంతర్గతం గా ప్రస్తుతానికి 15367 పాయింట్ల అవరోధాని దాటే శక్తి కోల్పోయిందని చెప్పాలి. పైన చర్చించిన విధం గా సెన్సెక్స్ స్టాకు ల లో కూడా ప్రాఫిట్ బూకింగ్ ప్రారంభమైతే , ఈ వారం మార్కెట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఐతే మార్కెట్లు భారిగా నష్టాలను చవిచూసే ప్రమాదం లేదనే చెప్పవచ్చు. మార్కెట్లు నష్టపోయినా , అంచలు వారిగా కొంత కొంత నష్టపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మన మార్కెట్ల తదుపరి గమనం కేవలం ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులపైనే ఆధార పడనున్నది. మన మార్కెట్లు నష్టపోయినా మదుపరులు భయ పడవలసిన అవసరం లేదని చెప్పవచ్చు.