• 15-06-2009 :: 6:30 PM

  • మార్కెట్ రిపోర్ట్ నేడు మార్కెట్లు , మేము సూచించిన విధంగా భాల్లూకాలకు ( bears ) కి స్వాగతం పలికాయి. నేడు స్టాక్ మార్కెట్ల పతనానికి ముఖ్య కారణం సెన్సెక్స్ "పెద్ద బాబు " -రిలయన్స్ నకు బొంబాయి హై కోర్టు లో RIL -RNRL గ్యాస్ తాలూకు వివాదం లో చుక్కెదురు కావడం తో నేడు ఈ కౌంటర్ 7.48 % క్షీణించింది. దీనితో సెన్సెక్స్ , నిఫ్టీ లు కూడా భారిగా నష్టపోయాయి. ఇది ఇలా ఉండగా RNRL కౌంటర్ నేడు 24 % ఎగబాకింది. RIL -RNRL వివాదం గురించి ప్రత్యెక విశ్లేషణ రేపటి సంచికలో " మార్కెట్ ఫోకస్ " పేజిలో అందించ నున్నాము నేడు సెన్సెక్స్ 362 పాయింట్లు నష్ట పోయి 14875 పాయింట్లకు ముగియగా , నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 4484 వద్ద ముగిసింది. నేడు స్మాల్ క్యాప్ రంగం 2.14 % , మిడ్ క్యాప్ రంగం 2.33 % నష్టపోయింది. నేటి మార్కెట్ లో BSE FMCG తప్ప మిగిలన అన్ని రంగాలు నష్టాలను చవిచూసాయి. ఈ రంగం ౦.6% లాభాలను అర్జించింది . నేడు ఆయిల్ మరియు గ్యాస్ రంగం అత్యధికంగా 4.5 % నష్టపోయింది. కాగా మెటల్స్ రంగం 3.9 % నష్టపోయింది. నేడు సెన్సెక్స్ స్టాకు లలో STERLITE, RELIANCE భారిగా 7.6 %, 7.5 % నష్టాలను నమోదు చేసింది.కాగా RANBAXY, TCS - 1.9 % వృద్ధి చెందాయి.
  • .................................