మార్కెట్ నాడి
నేటి మార్కెట్లు ముందుగా సుమారు 140 పాయింట్లు లాభాలతో ప్రారంభమయి కూడా మేము ముందుగా సూచించిన విధం గా 14930 పాయింట్ల అవరోధం దుర్బెధ్యమై నిల వటం తో సెన్సెక్స్ కేవలం 34పాయింట్ల స్వల్ప లాభం తో తృప్తి పడవలసి వచ్చింది. నేడు సెన్సెక్స్ ఒక దశ లో ఈ అవరోధాన్ని చెదించ లేక ప్రాఫిట్ బూకింగ్ కి లోనయ్యి 14608పాయింట్ల వరకు పడిపోయింది. ఈ అంశం కూడా మేము ఉదయమే చర్చించామని చదువరులు గమనించాలి. ఐతే మార్కెట్ఉ మరల పుంజుకొని చివరి క్షణాలలో షార్ట్ కవేరింగ్ మూలాన 14888 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సరిగ్గా మేము సూచించిన అవరోధమని గుర్తించాలి. ఐతే మార్కెట్లు ముగిసిన తరువాత జరిపిన మార్పుల వలన సెన్సెక్స్ 14785 వద్ద ముగిసినట్లు ప్రకటించటం గమనార్హం .
నేటి మార్కెట్ లో స్మాల్ క్యాప్ 0.91 % లాభ పడగా , మిడ్ క్యాప్ రంగం 0.82 % లాభాలను ఆర్జించింది.
నేడు కన్సుమేర్ డ్యురబుల్ రంగం అత్యధికం గా 2.63 % లాభ పడగా , మెటల్స్ వరుసగా రెండవ రోజు 2.48% లాభాలను ఆర్జించింది. కాగా రియాల్టి రంగం అత్యధికం గా 2 % నష్ట పోగా, పవర్ రంగం 1.65% క్షీణించింది.
ఇక స్టాకుల పరంగా ఆలోచిస్తే BAJAJ HOLDING 12.24 % ,ROLTA 11.42 % అత్యధికంగా లాభ పడగా, ACC 5.83 %, INDIA BULLSREAL ESTATE 6.02 % నష్టపోయిన A group వాటాలు గా నిలిచాయి.
.............................