02-06-2009 :: 8: 30 Am
మార్కెట్ నాడి
" ఎన్నాళ్ళో వేచిన ఉదయం ...
ఈనాడే ఎదురౌతుంటే . ... "
అని సినీ కవి అల్లిక నేడు మన మార్కెట్లకి అన్వయించుకోవచ్చు.
మార్కెట్లు నేడు అతి దుర్భేద్య మైన అవరోదాన్ని ఎదుర్కొనున్నాయి.సాధారణం గా ఐతే ఇటువంటి అవరోధం ఎదురైనప్పుడు మార్కెట్ ల లో కొంత ఉత్సాహం కొరవడుతుంది. కాని నేడు ఇందుకు అతీతం గా , ప్రపంచ మార్కెట్ల లో నెల కొని ఉన్న ఉత్సాహం మన మార్కెట్లకి అత్యవసర , అతి కీలక సమయం లో చేయూత నివ్వనున్నాయి.
నేడు సెన్సెక్స్ నకు 14888 పాయింట్లు అవరోధం కాగా, 14930అత్యంత భీకరమైన అవరోధం. ఈ అవరోధం దాటటం అంత సామాన్యమైన విషయం కాదు. మన మార్కెట్లు ప్రస్తుతం ఈ అవరోదానికి అత్యంత చేరువ లో ఉన్నాయి. మార్కెట్ల లో ప్రాఫిట్ బూకింగ్ జరిగే పరిస్థితి లో , ప్రపంచ మార్కెట్ల లో నెల కొని ఉన్న లాభా బాట మన మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నది. దీని ప్రభావం వలన మన మార్కెట్లు నేడు గ్యాప్ అప్ ప్రారంభం తో ఈ అవరోధాన్ని దాటి గట్టేక్కనున్నాయి.
PMI (MARKET PURCHASING MANAGERS INDEX ) గణాంకాల లో వరుసగా రెండవ నెల యాభై పాయింట్ల కంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయటం మెరుగవుతున్న పరిశ్రమల పరిస్థికి సూచకం. కేవలం మన దేశం లోనే కాక చైనా, ఐరోపా దేశాలలో కూడా ఇదే విషయం నమోదు కావడం విశేషం . ఆర్ధిక పరిస్థతి మెరుగవుతున్న దృష్యా , పెరగనున్న డిమాండ్ వలన ముడి చమురు ధరలలో వృద్ధి వంటి అంశాలు ప్రపంచ మార్కెట్ల లో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి.
సెన్సెక్స్ నేడు రెండు వందల పాయింట్ల పైగా లాభం పడితే మన మార్కెట్లు ఇక బుల్ రన్ లో అడుగుపెట్టినట్లు నిస్సందేహం గా చెప్పవచ్చు. కాబట్టి నేడు మన మార్కెట్ కి అతి కీలక మైన రోజు గా చెప్పుకొనవచ్చు. సెన్సెక్స్ నేడు లాభ పడి తే 15340 పాయింట్లు చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు ! 14930 వద్ద ప్రాఫిట్ బూకింగ్ జరిగే అవకాశం కూడా వుంది !
సెన్సెక్స్ కి నేటి కీలక మజిలీలు .
సెన్సెక్స్ క్రితం ముగింపు : 14840
అవరోధాలు : 14888- 14930 -15088
మదత్తు స్థాయిలు : 14757-14686-14243
- ........