- గత వారం సమీక్ష
- ( 08-06-2009 నుండి 11-06-2009 వరకు )
- ఈ వారం సెన్సెక్స్ వరుసగా 14వ వారం లాభం పడి సెన్సెక్స్ జైత్ర యాత్ర ని కొనసాగించింది . సెన్సెక్స్ గత వారం ముగింపైన 15103 పాయింట్ల వద్ద ప్రస్థానాన్ని కొనసాగించి 135 పాయింట్లు లాభ పడి 15238 పాయింట్ల వద్ద ,0.89 % వృద్ధిని నమోదు చేస్తూ ముగిసింది. కాగా నిఫ్టీ ఫ్లాట్ గా 4583.40 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ రంగం 2 % క్షీణించగా , స్మాల్ క్యాప్ 6.7 % నష్టపోయింది.
- గత ఆదివారం " మార్కెట్ ముందుచూపు " శీర్షిక లో మార్కెట్లు ప్రధానం గా 14686 ~ 15370 పాయింట్ల మధ్య సంచరించే అవకాశం ఉందని తెలియచేసాము. మా అంచనాలకు అనుగుణంగా నే మార్కెట్లు నడుచుకోవటం గమనార్హం .ఈ వారం లో సెన్సెక్స్ గరిష్టం గా 15580 పాయింట్లకు ఒక దశ లో చేరుకుంది. ఇది కూడా "మార్కెట్ ముందు చూపు " లో ---- సెన్సెక్స్ 15542 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉందని చర్చించాము. మా అంచనాలను నిజం చేస్తూ సెన్సెక్స్ పయనం సాగించింది.
- ఈ వారం లో రోజు వారిగా మార్కెట్ల గమనం ఈ విధం గా ఉన్నాయి.
- సోమవారం : మార్కెట్లు బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ భారిగా నష్టాలను చవిచూసింది. ఆ రోజు సెన్సెక్స్ లాభాల తో ఆరంభించినా ఆసియా మార్కెట్ల ప్రాభావం వలన కొంత ఒడిదుడుకులకు లోనయ్యి పయనం సాగించింది14980 పాయింట్ల వద్ద సెన్సెక్స్ మధ్యాన్నం వరకు మద్దతు తీసుకుని ట్రేడ్ కా సాగింది. కాని ఐరోపా మార్కెట్లు కూడా భారి నష్టాలతో ప్రారంభామవ్వటం తో మార్కెట్ల లో ప్రాఫిట్ బూకింగ్ మొదలయ్యింది. దీనివలన సెన్సెక్స్ 437 పాయింట్లు నష్టపోయి 14665 పాయింట్ వద్ద ముగియగా , నిఫ్టీ 157 పాయింట్లు నష్టపోయి 4429 పాయింట్ల వద్ద ముగిసింది. మదుపరులు స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్ల లో అమ్మకాలు భారిగా జరిపారు. స్మాల్ క్యాప్ రంగం 5.8 % నష్టపోగా , మిడ్ క్యాప్ రంగం 5.45 % నష్టపోయింది.
- మంగళవారం :మార్కెట్లు అనూహ్యం గా లాభం పడి , సోమవారం తాలూకు నష్టాలను భర్తీ చేసుకున్నాయి. సెన్సెక్స్ 461 పాయింట్లు లాభ పడి 15127 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 121 పాయింట్ల లాభాలను ఆర్జించి 4550 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 14686 పాయింట్ల మజిలి ని మద్దత్తు గా తీసుకుని ముందంజ వేసాయి. మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు లాభాల తో ప్రారంభామవ్వటం తో మన మార్కెట్లు మరింతగా జోరందుకున్నాయి. నాటి మార్కెట్లో స్మాల్ క్యాప్ రంగం 1.67 % లాభ పడగా, మిడ్ క్యాప్ రంగం 3.14 % లాభ పడింది. అన్ని రంగాలు లాభాల తో ముగియటం విశేషం.
- బుధవారం : వరుసగా రెండవ రోజు మన మార్కెట్లలో పచ్చ దానం కనిపించింది. . ప్రపంచ మార్కెట్లు అనుకూలంగా ఉండటం తో ఉదయం నుండి మార్కెట్లలో బుల్ల్స్ జోరు కొనసాగింది. సెన్సెక్స్ 15168పాయింట్ల వద్ద ప్రారంభమయి ఈ వారం లో గరిష్టం గా 15580 పాయింట్ వరకు ఎగబాకింది. మేము గత ఆదివారం " మార్కెట్ ముందుచూపు" శీర్షిక లొ ఈ వారం సెన్సెక్స్ 15542 చేరుతుందని ముందే చెప్పటం గమనార్హం సెన్సెక్స్ 339 పాయింట్లు లాభ పడి 15466 వద్ద ముగియగా, నిఫ్టీ 104 పాయింట్లు లాభ పడి 4655 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 12 నెలల గరిష్ట స్థాయి. మిడ్ క్యాప్ రంగం 1.6 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం కేవలం 0.3 % మాత్రమె లాభ పడింది.
- గురువారం : మార్కెట్లు మందకొడిగా సాగాయి. సెన్సెక్స్ 55.34 పాయింట్లు నష్టపోయి 15411 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 4637 పాయింట్ వద్ద ముగిసింది. మే 30నకు సంబంధించిన ద్రవ్యోల్బణ గాణాంకాలు విడుదల అయ్యాయి. ఇది 0.13 % గా నమోదయ్యింది. ఇది గత మూడు దశాబ్దాలలో నమోదయిన అత్యంత కనిష్ట పెరుగుదల . మిడ్ క్యాప్ రంగం 022 % నష్ట పోగా , స్మాల్ క్యాప్ ౦.9 % నష్టాలను చవిచూసింది
- శుక్రవారం :
- శుక్రవారం సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టంతో 15,238 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు క్షీణించి 4,583 వద్ద ముగిసింది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 15,600 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. అయితే మధ్యాహ్నపు తాజా ట్రేడ్‌ల నుండి సెన్సెక్స్ క్షీణించడం ప్రారంభించింది. పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ (ఐఐపీ) అంకెలు విడుదల అయ్యాయి. ఏప్రిల్ మాసానికి గాను ఇది 1.4 % గా నమోదు అయ్యింది. మార్చ్ మాసానికి గాను ఇది -0.7 % గా ఉండింది. ఐతే ఆశాజనకమైన పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ (ఐఐపీ) అంకెలు కూడా స్టాక్ మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంలో విఫల మవ్వడం తో సెన్సెక్స్ 15238 వద్ద నష్టాలతో ముగిసింది. . సెన్సెక్స్ 1.13 శాతం, నిఫ్టీ 1.17 శాతం చొప్పున క్షీణించాయి. మిడ్ క్యాప్ రంగం 2.10 % కోల్పోగా , స్మాల్ క్యాప్ రంగం 2.21 % క్షీణించింది.
- ఈ వారం రంగా ల వారి గా పరిశీలిస్తే మెటల్స్ రంగం 4.75 % వృద్ధిని నమోదు చేసింది. ఇందుకు గాను HINDALCO 8.5 % , NALCO 4.2 % , STERLITE 7.5 % వృద్ధిని నమోదు చేసి ఉపకరించాయి. మెటల్స్ తరువాత ఐ . టి. రంగం 3 % వృద్ధిని నమోదు చేసి అధికంగా లాభ పడింది. HCL -11 % , TCS-6%, WIPRO -3.5% లాభాలను ఆర్జించాయి. ఇండెక్స్ స్టాకు లలో MNM 10 %, TATA POWER 9.2 %, ABB, HDFC 7.8 % లాభ పడగా, BPCL, UNITECH, SBI ,DLF 10% నష్టాలను చవిచూసాయి. SUZLON 9.5 % నష్టపోయింది. ఇండెక్స్ స్టాకులు కాక ఇతర స్టాక్లలో సేస గోవా 28 % , SATYAM 20 %, TECH MAHINDRA 12.5 % వృద్ధిని సాధించాయి.
- ....................................................................