- నేడు సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టంతో 15,238 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు క్షీణించి 4,583 వద్ద ముగిసింది. మేము ఉదయమే సూచించిన విధంగా 36 పాయింట్లు లాభంతో 15,447 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 15,600 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. అయితే మధ్యాహ్నపు తాజా ట్రేడ్‌ల నుండి సెన్సెక్స్ క్షీణించడం ప్రారంభించింది. ఇది మా అంచనాలకు అనుగుణం గా జరిగింది. ఆశాజనకమైన పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ (ఐఐపీ) అంకెలు కూడా స్టాక్ మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంలో విఫలయ్యి , చివరకు మేము చెప్పినట్లే మార్కెట్లు నడుచుకున్నాయి అని అనటం లో అతిశయోక్తి లేదు . నేడు సెన్సెక్స్ కి 15228 పాయింట్ల వద్ద మద్దత్తు ఉందని మేము మా అంచనాలలో తెలియచేసాము. కాగా సెన్సెక్స్ నేడు 15238 వద్ద అతి సమీపం లో ముగియటం విశేషం. సెన్సెక్స్ 1.13 శాతం, నిఫ్టీ 1.17 శాతం చొప్పున క్షీణించాయి.
- నేడు మిడ్ క్యాప్ రంగం 2.10 % కోల్పోగా , స్మాల్ క్యాప్ రంగం 2.21 % క్షీణించింది. బీఎస్ఈ మెటల్ (లోహం) 1.9%, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్‌లు 1.4 % చొప్పున వృద్ధి చెందాయి. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ మాత్రం 2.5 % , ఆటో ఇండేక్స్ 2.4 % మేరకు క్షీణించింది.
- ఇక స్టాకుల వారిగా పరిశీలిస్తే Ranbaxy 6 %, Dlf -5.8 % భారిగా నష్టపోయిన సెన్సెక్స్ స్టాకులు కాగా Reliance 2.5% , sterlite 2.4 % అధికంగా లాభపడ్డాయి.
- .................................