- నిన్న కొంత విశ్రాంతి తీసుకున్న మన మార్కెట్లు నేడు మరల తదుపరి గమనం గురించి మరొక సారి ప్రపంచ మార్కెట్ల పైనే ఆధారపడనున్నాయి. మేము గత వారం " మార్కెట్ ముందుచూపు " శీర్షిక లో చర్చించిన విధం గా , సెన్సెక్స్ నకు సుమారు 15542 పాయింట్ల తరువాత ఆ పై పెరుగుదలకి కేవలం ప్రపంచ మారెట్ల పైనే ఆధార పడనున్నది
- గత రాత్రి అమెరికా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి స్వల్ప లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. నేడు మన మార్కెట్లు కూడా స్వల్ప లాభాల తో పయనించ వచ్చు. ఐతే వారాంతం కనుక మధ్య మధ్య లో కొంత ప్రాఫిట్ బూకింగ్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లు స్థిరత్వం పొందే దిశ గా పయనిస్తున్నాయని చెప్పవచ్చు.
- గత ముగింపు : 15411
- ముఖ్యమైన అవరోధాలు: 15568-15776-15851
- ముఖ్య మైన మద్దత్తు స్థాయిలు :15367-15228-15117-14986