11-06-2008 :: 5.30 pm
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు , ఉదయం మేము సూచించిన విధం గా మందకొడిగా సాగాయి. ఆసియా మార్కెట్లు కూడా ఒడిదుడుకుల తో FLAT గా ముగిసాయి. నేడు సెన్సెక్స్ 55.34 పాయింట్లు నష్టపోయి 15411 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 4637 పాయింట్ వద్ద ముగిసింది.
నేడు మే 30నకు సంబంధించిన ద్రవ్యోల్బణ గాణాంకాలు విడుదల అయ్యాయి. ఇది 0.13 % గా నమోదయ్యింది. ఇది గత మూడు దశాబ్దాలలో నమోదయిన అత్యంత కనిష్ట పెరుగుదల. ద్రవ్యోల్బణం ఇంత తక్కువ స్థాయిలో ఉన్నది కనుక బ్యాంకులు వడ్డీ రేటు ని కనీసం 25 bps తగ్గించవచ్చని ఆంచనా. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు SBI, CANARA BANK, UNION BANK, BANK OF MAHARASHTRA వడ్డీ రేటుని తగ్గించే ప్రక్రియలో ఉన్నాయని సూచన ప్రాయంగా తెలిపాయి.
నేడు మిడ్ క్యాప్ రంగం 022 % నష్ట పోగా , స్మాల్ క్యాప్ ౦.9 % నష్టాలను చవిచూసింది. నేడు మెటల్స్ రంగం అత్యధికం గా 2.95 % , ఆటో రంగం ౦.84 % లాభాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచాయి. కాగా నేడు ఐ.టి రంగం భారి గా 2.58 % నష్టపోయింది. నేడు psu రంగం 1.84 % నష్టాలను నమోదు చేసింది.
నేడు INDIA CEMENTS 6.88 %, LANCO 5.91 % నష్టాలను చవిచూసాయి. TULIP నేడు భారిగా 11.64 %, TATA COMM 9.71 % లాభాలను ఆర్జించిన A GROUP స్టాకులు.
- ..................................