11-06-2009:: 8 AM

మార్కెట్ నాడి

నేడు రెండు రోజుల భారి లాభార్జన అనంతరం ,మార్కెట్లు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగియటం, ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనించటం వంటి అంశాలు పరిశీలిస్తే మన మార్కెట్లు నేడు కొంత దుడుకు స్వభావాన్ని విడనాడే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్లు ఇప్పటికే దాదాపు తారా స్థాయి కి చేరుకోవడం, దాదాపు అన్ని ప్రధాన షేర్లు వాటి అవరోధాలను సమీపించటం వంటి అంశాలు గమనిస్తే నేడు మార్కెట్లు కొంత మందకొడిగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నేడు ప్రాఫిట్ బూకింగ్ పెద్దగా కనిపించక పోయినా , స్థిరత్వం దిశగా పయనించే విధం గా మార్కెట్లు ఉండవచ్చని చార్ట్లు తెలుపుతున్నాయి.

నేడు మే ౩౦ తాలూకు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదలకానున్నాయి. ఈ ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. ప్రస్తుత ర్యాలీ సుమారు సెన్సెక్స్ 15860 ~15992 పాయింట్ల వద్ద బ్రేక్ పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా చర్చించినట్లు మార్కెట్లు తారాస్థాయి కి చేరువలో ఉన్నందున, నేడు మార్కెట్లు మరింత పెరిగితే, మదుపరులు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది.

అదే విధం గా మ్యూచువల్ ఫండ్స్ , ULIP పాలసీ లకు సంబంధించిన FUND SWITCH OVER గురించి కూడా ఆలోచన చేయవచ్చు. ( ఈ విషయం లో మీ వ్యక్తీగత ఆర్ధిక సలహాదారుని సూచన పాటించగలరు .)

సెన్సెక్స్ నకు కీలక మజిలీలు

గత ముగింపు : 15467

ముఖ్యమైన అవరోధాలు: 15568-15776-15851

ముఖ్య మైన మద్దత్తు స్థాయిలు :15367-15228-15117-14986

  • ..............................................................................