10-06-2009 :: 6 pm

మార్కెట్ రిపోర్ట్

నేడు వరుసగా రెండవ రోజు మన మార్కెట్లలో నందులు ( బుల్ల్స్ ) విజయ భేరి మ్రోగించాయి. ప్రపంచ మార్కెట్లు అనుకూలంగా ఉండటం తో నేడు ఉదయం నుండి మార్కెట్లలో బుల్ల్స్ జోరు కొనసాగింది. నేడు సెన్సెక్స్ 15168పాయింట్ల వద్ద ప్రారంభమయి గరిష్టం గా 15580 పాయింట్ వరకు ఎగబాకింది. మేము గత ఆదివారం " మార్కెట్ ముందుచూపు" శీర్షిక లొ ఈ వారం సెన్సెక్స్ 15542 చేరుతుందని ముందే చెప్పటం గమనార్హం

నేడు సెన్సెక్స్ 339 పాయింట్లు లాభ పడి 15466 వద్ద ముగియగా, నిఫ్టీ 104 పాయింట్లు లాభ పడి 4655 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 12 నెలల గరిష్ట స్థాయి. నేడు 56వారాల గరిష్ట స్థాయి చేరుకుంటుందని కూడా మేము ఉదయం చర్చించటం జరిగింది.

నేడు మిడ్ క్యాప్ రంగం 1.6 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం కేవలం 0.3 % మాత్రమె లాభ పడింది.

నేడు పవర్ , క్యాపిటల్ గూడ్స్ రంగాలు అధికంగా 3.6% ,3.5 %, వృద్ధిని సాధించాయి. నేటి ట్రేడింగ్ లొ కేవలం రియాల్టి రంగం మాత్రమె నష్టాలను చవిచూసింది. రియాల్టి రంగం 1.1 % నష్టపోయింది

ఇక స్టాకుల వారిగా పరిశీలిస్తే నేడు టాటా పవర్ -6.4%, Reliance Infra - 6% అత్యధికం గా వృద్ధిని నమోదు చేయగా, Tata motors- 2 %, DLF- 1.7 % అధికంగా నష్ట పోయిన సెన్సెక్స్ స్టాకులు గా నిలిచాయి.

  • .........................................................................................