10-06-2009 :: 8 AM

మార్కెట్ నాడి

నిన్న భారి గా లాభ పడిన మన మార్కెట్లకు నేడు కూడా ప్రపంచ మార్కెట్లు సహకరిస్తున్నాయని చెప్పవచ్చు. గత రాత్రి అమెరికా మార్కెట్లు నిర్ణయాత్మకంగా లాభాల బాట లో నడిచింది. గత రెండు రోజులు గా ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో ముందుకు సాగే ధోరణి కి స్వస్తి చెప్పి లాభాల బాట లో పయనిస్తున్నాయి. నేడు మన మార్కెట్లు గత 56 వారాల గరిష్ట స్థాయిని అందుకునే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ నకు 15367 వద్ద కీలక అవరోధం ఉందని గమించాలి .నేడు సెన్సెక్స్ గ్యాప్ అప్ ప్రారంభమైతే పైన తెలిపిన అవరోధాన్ని సునాయాసం గా చేదించే అవకాశం ఉంది. రెండు రోజులు గా మందకొడిగా ఉన్న స్మాల్ క్యాప్ షేర్ల లో నేడు కొంత కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది.

నేడు సెన్సెక్స్ నకు ముఖ్య మజిలీలు

గత ముగింపు : 15127

అవరోధాలు : 15367 -15422-15503

మద్దత్తు స్థాయిలు : 15066-14964-14757

  • ..