- 09-06-2009 :: 6 PM
నేడు మన మార్కెట్లు అనూహ్యం గా లాభం పడి , నిన్నటి నష్టాలను భర్తీ చేసుకున్నాయి. నేడు సెన్సెక్స్ 461 పాయింట్లు లాభ పడి 15127 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 121 పాయింట్ల లాభాలను ఆర్జించి 4550 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మేము సూచించిన 14686 పాయింట్ల మజిలి అతి కీలక పాత్ర నిర్వహించింది. నేడు మేము ఉదయం సూచించిన విధం గా సెన్సెక్స్ 14686 పాయింట్ల మజిలి ని మద్దత్తు గా తీసుకుని మా మేము అంచనాలకు అనుగుణంగా 14820 పాయింట్ల వరకు ఎగబాకింది. ఈ అవరోధం వద్ద సుమారు గంట సేపు ట్రేడ్ అయ్యిందని గమనించాలి . ఈ తరువాత మార్కెట్లలో నిన్నటి భయం దూరం కావటం తో మార్కెట్లు మరింత ముందంజ వేసాయి. ఐతే మేము ఉదయమే సూచించిన విధం గా ఐరోపా మార్కెట్ల గమనం మన మార్కెట్ల కి అతి కీలక మయ్యింది. మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు లాభాల తో ప్రారంభామవ్వటం తో మన మార్కెట్లు మరింతగా జోరందుకున్నాయి.
నేటి మార్కెట్లో స్మాల్ క్యాప్ రంగం 1.67 % లాభ పడగా, మిడ్ క్యాప్ రంగం 3.14 % లాభ పడింది.
నేటి మార్కెట్ల లో అన్ని రంగాలు లాభాల తో ముగియటం విశేషం.
నేడు లాభ పడిన స్టాకులను పరిశీలిస్తే tech mahindra 25.5 % లాభాలను ఆర్జించింది. నేడు అంచనాలను మించి మంచి ఫలితాలు ఇవ్వటం తో satyam నేడు గరిష్ట సీలింగ్ చేరుకుంది.
ఇక రంగాల వారిగా పరిశీలిస్తే, నేడు మార్కెట్ల లో అన్ని రంగాలు లాభాల తో ముగియటం విశేషం. రియాల్టి రంగం అత్యధికం గా 6.2 % లాభ పడగా , ఐ. టి 4.8 %, లాభ పడింది. సెన్సెక్స్ స్టాకు ల లో DLF - 10 %, J P ASSOCIATES 8.2 % లాభాలను నమోదు చేసి అత్యంత మెరుగైన ప్రదర్శనని ఇచ్చాయి. కాగా GRASIM , NTPC -0.6 % నష్టాలను నమోదు చేసాయి.
- ........