గత వారం సమీక్ష

(1-6-2009 నుండి 05-06-2009 )

ఈ వారం సెన్సెక్స్ వరుసగా 13వ వారం లాభం పడి సెన్సెక్స్ జైత్ర యాత్ర ని కొనసాగించింది . సెన్సెక్స్ గత వారం ముగింపైన 14625పాయింట్ల వద్ద ప్రస్థానాన్ని కొనసాగించి 478పాయింట్లు లాభ పడి 15103 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం లో సెన్సెక్స్ గరిష్టం గా 15257 పాయింట్లకు ఒక దశ లో చేరుకుంది. మేము గత వారం "మార్కెట్ ముందు చూపు " లో సెన్సెక్స్ 15340 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉందని చర్చించాము. మా అంచనాలను దాదాపు నిజం చేస్తూ సెన్సెక్స్ పయనం సాగించింది. ఈ వారం లో రోజు వారిగా మార్కెట్ల గమనం ఈ విధం గా ఉన్నాయి.

  • సోమవారం
  • మార్కెట్లు లాభాల బాట లో నడుస్తూనే ఒకింత ఒడిదుడుకులకు లోనయ్యింది. ఉదయం ప్రారంభం లో నే మార్కెట్లు 14886 పాయింట్లకి చేరింది. కాని 14888 పాయింట్ల అవరోధం వద్ద సెన్సెక్స్ కొంత కోల్పోయింది. చివరకు sensex 215 పాయింట్లు లాభ 14840పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 81 పాయింట్లు లాభ పడి 4530 పాయింట్ల వద్ద ముగిసింది. నాడు మార్కెట్లో మిడ్ క్యాప్ షేర్లు 2.92 % వృద్ధి ని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ షేర్లు అత్యధికంగా 3.51 % వృద్ధి ని నమోదు చేసాయి. PMI (MARKET PURCHASING MANAGERS INDEX ) విడుదల అయ్యాయి. ఈ గణాంకాల లో వరుసగా రెండవ నెల యాభై పాయింట్ల కంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయటం మెరుగవుతున్న పరిశ్రమల పరిస్థి ని సూచించటం తో మార్కెట్ల లో ఉత్సాహం నెలకొని ఉండింది.

  • మంగళ వారం

మార్కెట్లు ముందుగా సుమారు 140 పాయింట్లు లాభాలతో ప్రారంభమయి కూడా 14930 పాయింట్ల అవరోధం దుర్బెధ్యమై నిల వటం తో సెన్సెక్స్ కేవలం 34పాయింట్ల స్వల్ప లాభం తో తృప్తి పడవలసి వచ్చింది. సెన్సెక్స్ ఒక దశ లో ఈ అవరోధాన్ని చెదించ లేక ప్రాఫిట్ బూకింగ్ కి లోనయ్యి 14608పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే మార్కెట్ మరల పుంజుకొని చివరి క్షణాలలో షార్ట్ కవేరింగ్ మూలాన 14785 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ రోజు మార్కెట్ లో స్మాల్ క్యాప్ 0.91 % లాభ పడగా , మిడ్ క్యాప్ రంగం 0.82 % లాభాలను ఆర్జించింది.

  • బుధ వారం

మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసినా , నాడు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. సెన్సెక్స్ 14902 పాయింట్లకు ఆరంభించి అతి దుర్భేద్యనమైన 14930 పాయింట్ల అవరోధాన్ని దాటి , ఒక దశ లో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి, అంటే 15046 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే ట్రేడింగ్ మధ్య లో సెన్సెక్స్ ప్రాఫిట్ బూకింగ్ నకు లోనయ్యి 14733 పాయింట్ల వరకు చేరుకుంది. మార్కెట్లు మరల కొంత పుంజుకొని ,చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. ట్రేడింగ్ లో సెన్సెక్స్ కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి 14871 వద్ద ముగియగా , నిఫ్టీ 5 పాయింట్లు లాభ పడి 4531 పాయింట్ల వద్ద ముగిసింది.

  • గురు వారం :

బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్లు కూడా నష్టాలలో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ సుమారు 150 పాయింట్ల నష్టం చవిచూసి కనిష్టం గా 14599 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే, రాష్ట్ర పతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు పార్లమెంట్ సంయుక్త సభలో చేసిన ప్రసంగం మార్కెట్లో కొంత ఊపిరి నింపాయి. వారు ప్రసంగం లో ప్రభుత్వ రంగం లో సంస్కరణలు చేపట్టనున్నాటు చేసిన ప్రకటన, ఆర్ధిక రంగాన్ని ఉద్దీపన చేయనున్నట్లు , అందుకు గాను పెన్షన్ రంగం లో మార్పులు, ఎగుమతులకు చేయూత వంటి అంశాలు ప్రసంగించటం తో మార్కెట్ల లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీని తో సెన్సెక్స్ 138 పాయింట్లు లాభ పడి 15008.68 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 42 పాయింట్లు లాభ పడి 4573 వద్ద ముగిసింది.

ఇదే రోజున , మే 23 నకు సంబంధించిన ద్రవ్యోల్బణ గాణాంకాలు విడుదల అయ్యాయి. ఇది 0.48 % గా నమోదయ్యింది. గత వారం వార్షిక పెరుగుదల 0.61 % గా వుండింది. గురువారం మిడ్ క్యాప్ రంగం 2.26 % లాభ పడగ, స్మాల్ క్యాప్ 2.20 % లాభాలను ఆర్జించింది.

  • శుక్ర వారం :

మార్కెట్లు ఒడిదుడుకులతో ప్రారంభమయ్యింది. ఒక దశ లో మార్కెట్లు కోల్పోయి 14993 పాయింట్ల కు దిగజారింది. ఐతే 14986 పాయింట్ల వద్ద మార్కెట్లు త్వరగా కోలుకోని లాభాల బాట లో పయనించాయి. మధ్యాహ్న ప్రారంభ ట్రేడ్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం, చిన్న స్థాయి కంపెనీల్లోను కొనుగోళ్ల జరగడంతో ఇండెక్స్ బాగా పుంజుకుంది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ కనిష్ఠ స్థాయి నుండి 264 పాయింట్లు లాభపడి 15257 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. మరో గంటలో స్టాక్ మార్కెట్ ముగుస్తుందనగా.. లాభార్జనకై ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరిచారు.ప్రత్యేకించి ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాకుల్లో లాభార్జనకై క్రయవిక్రయాలు సాగడంతో ఇండెక్స్ స్వల్పంగా తగ్గినప్పటికీ 95పాయింట్లు లాభంతో స్టాక్ మార్కెట్ ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు లాభ పడి 4586 వద్ద ముగిసింది.

  • ఈ విధం గా మన మార్కెట్లు వరుసగా 13 వ వారం లాభాల తో ముగియటం విశేషం. మార్కెట్ల అక్టోబర్ మాసం కనిష్ట స్థాయి తో పోలిస్తే ఇప్పటివరకు మార్కెట్లు 58 % వృద్ధిని నమోదు చేసింది. ఈ వారం లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ సుమారు 3 % వృద్ధిని నమోదు చేసాయి. మెటల్స్ రంగం, ఆటో రంగం అత్యధికం గా 7 ~ 8 % లాభ పడింది. హెల్త్ కేర్, యఫ్.యం . సి. జి. , రియాల్టి రంగాలు కూడా భారి గా లాభ పడ్డాయి.
  • ఇక స్టాకుల వారి గా పరిశీలిస్తే Suzlon 33 %, Unitech - 23 %, Grasim - 20 %, Tata Motors, Tata steel 14 % , మిడ్ క్యాప్ రంగం లో Bajaj kindusthan, Gujrat NRE coke, Jai prakash Hydro 40 %, Aban offshore, Welspun gujarat, Satyam, Adlabs, Voltas సుమారు 26 ~ 32 %, Rolta, TTML, IFCI 15 ~ 22 % వృద్ధిని నమోదు చేసాయి.

  • .....