• (08/06/2009 నుండి 12/06/2009 )
  • మార్కెట్ ముందు చూపు
మన మార్కెట్లు ఇప్పటి వరకు 13 వారాల పాటు వరుసగా లాభాలను గడించాయి. సెన్సెక్స్ ఇప్పుడి స్థాయి ని పరిశీలిస్తే ఇది 55 వారాల గరిష్ట స్థాయి అని గుర్తించవచ్చు .
గత వారం సెన్సెక్స్ కి 14930 పాయింట్ల అతి భీకరమైన అవరోధాన్ని దాటటం వలన మార్కెట్లు bear మార్కెట్ నుండి బయట పడినట్లు చెప్పవచ్చు. అంటే ,అక్టోబర్ మాసం లో ని కనిష్ట స్థాయి మరల చేరుకునే అవకాశం లేదు .
ఆర్ధిక మాంద్యం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత భారి స్థాయి లో ఈ సారే ప్రపంచాన్ని ఆవహించింది. ఈ పరిస్థితులలో కేవలం భారత్ చైనా లు మాత్రమె ఆర్థికాభివృద్ధి సాధించనున్నట్లు ఆంచనాలు. ఈ అంశం మన మార్కెట్ల కి శుభసూచకం. విదేశీ పెట్టుపడులు మన దేశం లో వచ్చే అవకాశాలు పెరగటం తో మన మార్కెట్లు దీర్ఘ కాలిక అంచనాల ప్రకారం 18 వేల పాయింట్లు వరకు చేరే అవకాశం ఉంది.
ఇక వచ్చే వారం గురించి పరిశీలిస్తే, మార్కెట్లు ఇంకా బలంగా నే ఉన్నాయని చెప్పవచ్చు. సెన్సెక్స్ పయనం ఇదే విధం గా కొనసాగితే, సుమారు 15732 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉంది. ఐతే ఇది జరగాలంటే FII ల కొనుగోళ్ళు కీలకం. గత వారం చాల మటుకు దేశీయ పెట్టుబడుదారుల వలన కొనుగోళ్ళు జరిగాయి కనుక ఈ వారం ప్రపంచ మార్కెట్లు సహకరిస్తే FII లే మరల రంగ ప్రవేశం చేయవచ్చు.
ప్రపంచ మార్కెట్లు సహకరిస్తాయా అన్నదే ప్రశ్న. మొన్న విడుదలైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం తోDOWJONES , NASDAQ మార్కెట్ల లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితే ఆసియా మార్కెట్ల లో కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది జరిగితే మన మార్కెట్లకి బహుశా జైత్ర యాత్ర కి విరామం పలికే సమయం ఆసన్నమయ్యింది.
మన మార్కెట్ల లో ప్రాఫిట్ బూకింగ్ జరుగుతున్నామరల కొనుగోళ్ళు జరుగుతున్నందున ఈ వారం సెన్సెక్స్15542 పాయింట్ల వరకు చేరుకునే అవకాశాలు చాల ఉన్నాయి. ఆ తరువాత 15732 పాయింట్ల వరకు చేరాలంటే ప్రపంచ మార్కెట్ల సహాయం ఉండితీర వలసినదే. SENSEX నకు 14686 వద్ద మంచి మద్దత్తు ఉంది. సెన్సెక్స్ 14686 ~ 15370 మధ్య స్థిరత్వ దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయి. మధ్యమధ్య లో జరిగే అమ్మకాల వలన ఒడిదుడుకులకు లోనవ్వనున్నది.
  • .........................