- 05-06-2009 :: 6 pm
- మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు ఉదయం మేము సూచించినట్లు , ఒడిదుడుకులతో ప్రారంభమయ్యింది. ఒక దశ లో మార్కెట్లు కోల్పోయి 14993 పాయింట్ల కు దిగజారింది. ఐతే మేము సూచించిన 14986 మద్దత్తు సహాయం వలన మార్కెట్లు త్వరగా కోలుకోని లాభాల బాట లో పయనించాయి. మధ్యాహ్న ప్రారంభ ట్రేడ్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం, చిన్న స్థాయి కంపెనీల్లోను కొనుగోళ్ల జరగడంతో ఇండెక్స్ బాగా పుంజుకుంది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ కనిష్ఠ స్థాయి నుండి 264 పాయింట్లు లాభపడి 15257 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. మరో గంటలో స్టాక్ మార్కెట్ ముగుస్తుందనగా.. లాభార్జనకై ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరిచారు.ప్రత్యేకించి ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాకుల్లో లాభార్జనకై క్రయవిక్రయాలు సాగడంతో ఇండెక్స్ స్వల్పంగా తగ్గినప్పటికీ 95పాయింట్లు లాభంతో స్టాక్ మార్కెట్ ముగిసింది.
ఇది మేము ఉదయం చర్చించిన 15117 పాయింట్ల అవరోదానికి కి అతి సమీపంగా ఉందని గ్రహించాలి.
నేడు నిఫ్టీ 14 పాయింట్లు లాభ పడి 4586 వద్ద ముగిసింది. ఈ విధం గా మన మార్కెట్లు వరుసగా 13 వ వారం లాభాల తో ముగియటం విశేషం. మార్కెట్ల అక్టోబర్ మాసం కనిష్ట స్థాయి తో పోలిస్తే ఇప్పటివరకు మార్కెట్లు 58 % వృద్ధిని నమోదు చేసింది.
నేటి మార్కెట్లో మిడ్ క్యాప్ రంగం 0.67 %, , స్మాల్ క్యాప్ రంగం 1.02 % నష్టపోయాయి. నేడు క్యాపిటల్ గూడ్స్ రంగం 2.95 %, ఐ. టి. 2.61 %, ఆటో 2.49 % లాభాలను అధికం గా ఆర్జించగా, FMCG 2.34 %, రియాల్టి 2.12% నష్టాలను చవిచూసాయి. నేటి సెన్సెక్స్ స్టాకు ల లో GRASIM 6.1 %, TATA MOTORS 5.3 % లాభ పడి అత్యధికం గా లాభ పడ్డ స్టాకు లు గా నిలిచాయి. కాగా ITC 5.5 % ,RELIANCE INFRA 3.7 % నష్టపోయాయి.
- ..............