08-06-2009 :: 8 AM
మార్కెట్ నాడి :
నిన్నటి రక్తసిక్తం తరువాత నేడు మార్కెట్లు మరొక సారి వాటి గమనాల కొరకు ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులపై ఆధారపడి ఉన్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి నష్టా ల నుండి కోలుకోని ఫ్లాట్ గా ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకుల తో పయనం సాగిస్తోంది. మన మార్కెట్లు కూడా నేడు అప్రమత్త ధోరణి లో పయనం సాగించనున్నాయి. నిన్నటి మార్కెట్ల లో ముఖ్య మైన " పెద్ద షేర్లు " నిలకడగా ఉన్నందున దీర్ఘకాలిక మదుపరులు భయాందోళన చెందవలసిన పరిస్థితి లేదు. దీర్ఘ కాలిక మదుపరులు సెన్సెక్స్ 14000 పాయింట్ల కంటే తక్కువగా పడిపోయినప్పుడు ఆలోచన చెయవచ్చు.
నేడు మార్కెట్ ప్రారంభంపైన ద్రుష్టి సారించాలి . సెన్సెక్స్ 14686 కంటే ఎక్కువగా సెన్సెక్స్ ప్రారంభమైతే నేడు 14820 వరకు చేరి, చివరకు ఫ్లాట్ గా ముగిసే అవకాశం ఉంది. అదే 14686 కీలక మద్దత్తు స్థాయి కంటే తక్కువగా ప్రారంభమైతే ,నేడు సెన్సెక్స్ 14370 వద్ద తిరిగి కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది.
మార్కెట్ ఆరంభం ఎలా వుంటుందో, దాని కి అనుగుణంగా నేడు ట్రేడింగ్ చేయటం ఉత్తమం. ప్రపంచ మార్కెట్ల పై నిరంతరం ద్రుష్టి సారించటం మంచిది. ముఖ్యంగా మధ్యాన్నం ఐరోపా మార్కెట్ల నడవడి మన మార్కెట్ల ముగింపును నేడు నిర్దేశించనున్నాయి. ఏది ఏమైనా , నేడు మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించ నున్నది.
నేటి సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
గత ముగింపు : 14666
నిర్ణయాత్మక మజిలి : 14686
కీలక మద్దత్తులు : 14586-14482-14349
అవరోధాలు :: 14757 -14866-14940
- .......