- నేడు మన మార్కెట్లు బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ భారిగా నష్టాలను చవిచూసింది. నేడు సెన్సెక్స్ లాభాల తో ఆరంభించినా ఆసియా మార్కెట్ల ప్రాభావం వలన కొంత ఒడిదుడుకులకు లోనయ్యి పయనం సాగించింది. మేము సూచించినట్లు 14980 పాయింట్ల వద్ద సెన్సెక్స్ మధ్యాన్నం వరకు మద్దతు తీసుకుని ట్రేడ్ కా సాగింది. కాని ఐరోపా మార్కెట్లు కూడా భారి నష్టాలతో ప్రారంభామవ్వటం తో మార్కెట్ల లో ప్రాఫిట్ బూకింగ్ మొదలయ్యింది.
- దీనివలన సెన్సెక్స్ 437 పాయింట్లు నష్టపోయి 14665 పాయింట్ వద్ద ముగియగా , నిఫ్టీ 157 పాయింట్లు నష్టపోయి 4429 పాయింట్ల వద్ద ముగిసింది.
- నేటి పతనానికీ కారణం "risk aversion " అని చెప్పవచ్చు.గతం లో లాగా ఇరుక్కుపోతామని భయాందోళన అధికంగా కనిపించిందని చెప్పవచ్చు-- మదుపరులు స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్ల లో అమ్మకాలు భారిగా జరిపారు. స్మాల్ క్యాప్ రంగం 5.8 % నష్టపోగా , మిడ్ క్యాప్ రంగం 5.45 % నష్టపోయింది. ఐతే సెన్సెక్స్ heavy weight "RELIANCE INDUSTRIES" కేవలం రూ. 22/- ( 1.04 % ) మాత్రమె నష్టపోయింది . ఈ అంశం " RISK AVERSION" వాదన కి బలం చేకూరుస్తోంది.
- నేడు ఐ. టి. రంగం మినహా అన్ని రంగాలు భారిగా నష్టపోయాయి. ఐ. టి రంగం 1.6% వృద్ధి ని నమోదుచేసింది. ఇందుకు విప్రో 3.4 % , ఇన్ఫోసిస్ 2.5 % లాభ పడి ఈ రంగానికి బలం చేకూర్చాయి. రియాల్టి రంగం 10.5 % అత్య్దదికంగా నష్టపోయింది . JP ASSOCIATES, DLF 10.4 % అధిక నష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్ స్టాకులు.