04-06-2009 :: 9 AM
మార్కెట్ నాడి
అమెరికా లో నిన్న వెలువడిన ఆర్ధిక గణాంకాలు బలహీనంగా ఉండటం తో , ఆ ప్రకంపనలు అమెరికా మార్కెట్ల తో సహా , నేడు ఆసియా మార్కెట్ల పై కూడా పడింది. మన మార్కెట్లు కూడా నేడు ప్రపంచమార్కెట్ల తో శృతి కలుపనున్నాయి. అంతే కాక గత రెండు రోజులుగా మేము సూచిస్తున్నట్లు సెన్సెక్స్ నకు 14930పాయింట్ల వద్ద అతి భీకరమైన అవరోధం ఉంది. ఈ పరిస్థిలో నేడు మార్కెట్లు రానిస్తాయని చెప్పలేము. నేడు మార్కెట్లు ప్రాఫిట్ బూకింగ్ కి లోనయ్యే అవకాశం ఉంది. మార్కెట్ల లో ఈ పరిస్థితి నేడు నెలకొని ఉంటుంది అని నిన్ననే మేము సూచించటం ఈ సందర్భం లో గమనర్హం. మార్కెట్లు రాబోయే ఈ రెండు రోజులు కొంత స్థిరత్వం వైపుకి పయనించే అవకాశం ఉంది. సెన్సెక్స్ 14534పాయింట్ల వద్ద బలమైన మద్దత్తు ఉంది. నేడు బ్యాంకింగ్ రంగం కొంత బలహీనత కనపరిచే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక మదుపరులు మార్కెట్లు నష్ట పోయినప్పుడు కొనుగోళ్ళు చేయవచ్చు.
నేడు మార్కెట్లు చివరి దశ లో షార్ట్ కవెరింగ్ వలన కొంత నష్టాలను పూర్చుకునే అవకాశం ఉంది.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
గత ముగింపు : 14871
అవరోధాలు : 14888 -14930 -15088
మద్దత్తు స్థాయిలు : 14757-14686-14534-14243